Sunday, September 8, 2024

పటేల్ లేకుంటే తెలంగాణకు త్వరగా విముక్తి వచ్చేది కాదు

- Advertisement -

బీజేపీ వల్లనే అధికారికంగా విమోచనం

Without Patel, Telangana would not have been freed quickly
Without Patel, Telangana would not have been freed quickly

హైదరాబాద్, సెప్టెంబర్ 17, (వాయిస్ టుడే ):  తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 75వ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆధునిక తెలంగాణ, మహారాష్ట్రలోని మరాఠ్‌వాడా ప్రాంతం, కర్ణాటకలోని పలు జిల్లాలతో కూడిన హైదరాబాద్‌ రాష్ట్ర విముక్తి పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీరులకు నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ చరిత్రను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. నిజాం హయాంలో తెలంగాణకు విముక్తి కల్పించి స్వాతంత్య్రం రాకుంటే భారతమాత కడుపులో కాన్సర్ వచ్చినట్లేనని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ప్రకటనను కేంద్ర మంత్రి అమిత్‌ షా గుర్తు చేశారు. ‘సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి వచ్చేది కాదు. దేశాన్ని ఏకం చేయాలనే నినాదంతో పోలీసు చర్యలకు సిద్ధమయ్యామన్నారు. మిలటరీ ‘ఆపరేషన్ పోలో’ ప్రారంభించిన తర్వాత చుక్క రక్తం చిందకుండా, నిజాం భారత్‌ శక్తి కంటే ముందే పోరాడి తెలంగాణ స్వాతంత్య్రానికి సిద్ధమయ్యారు. పటేల్ ఆదేశాల మేరకే కేఎం మున్షీ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. తెలంగాణ స్వాతంత్య్రోద్యమ సమయంలో ఆర్యసమాజ్, హిందూ మహా సభ వంటి అనేక సంస్థలు పనిచేశాయి. 75 సంవత్సరాలుగా దేశంలోని ఏ ప్రభుత్వం కూడా మన యువతకు తెలంగాణా స్వాతంత్ర్య పోరాటం గురించి చెప్పడానికి ప్రయత్నించలేదు. చరిత్రలో ఈ సంఘటనలకు తగిన గౌరవం ఇవ్వడంతో పాటు, ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుంది. తెలంగాణ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వడమే లక్ష్యం. మన పెద్దల పోరాటాన్ని స్మరించుకుని వారు కలలుగన్న రాష్ట్రాన్ని నిర్మించడమే సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల లక్ష్యం. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది’ అని అమిత్‌షా పేర్కొన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ చరిత్రను దాదాపు 75 ఏళ్ల పాటు కొందరు వక్రీకరించారని, మోదీ ప్రధాని అయ్యాక ఆ తప్పుల్ని సరిచేశారని వెల్లడించారు అమిత్ షా. ఈ 9 ఏళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. సర్దార్ పటేల్, కేఎం మున్షీ కారణంగానే తెలంగాణలో నిజాం పాలన అంతమైందని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థాన్ విమోచన ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి తెలియకుండా గత ప్రభుత్వాలు కుట్ర చేశాయని మండి పడ్డారు. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన ఈ పోరాటం..సమైక్యతా దిన ఎలా అవుతుందని పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ సర్కార్ ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. దీన్ని ఉద్దేశించే అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు.  ఓటు బ్యాంకు కోసమే విమోచన దినోత్సవాన్ని రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు.

Without Patel, Telangana would not have been freed quickly
Without Patel, Telangana would not have been freed quickly

“బ్రిటీష్‌ నుంచి భారత్‌కి స్వాతంత్య్రం వచ్చినా నిజాంలు తెలంగాణను 399 రోజుల పాటు పాలించారు. అన్నిరోజులు ఇక్కడి ప్రజలు నరకం చూశారు. సర్దార్ పటేల్‌ రంగంలోకి దిగి 400వ రోజు వాళ్లకు నిజాం కర్కశ పాలన నుంచి విముక్తినిచ్చారు. విమోచన దినోత్సవం జరపాలంటే కొందరు భయపడుతున్నారు”

మోడీ కారణంగానే..

ఇక బుజ్జగింపుల కోసం వాస్తవాలను దాచిపెడితే చరిత్ర మిగిలిపోదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ‘భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా 399 రోజుల పాటు నిజాం భూభాగంలో రజాకార్ల అరాచకాలు కొనసాగాయి. మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి. హైదరాబాద్ విమోచన దినోత్సవంతో తెలంగాణ ప్రజల స్వాతంత్య్ర వేడుకలను అధికారికంగా నిర్వహించాలన్నది ప్రధాని మోదీ ఆలోచన’ అని అమిత్‌షా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అమిత్ షా. మోడీ కారణంగానే దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని, G20 ద్వారా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను మరోసారి ప్రపంచానికి తెలియజేశామని ఆయన ప్రజలకు గుర్తు చేశారు. భారత్ చేస్తున్న అభివృద్ధిని నేడు ప్రపంచం మొత్తం కొనియాడుతుందని అమిత్ షా తెలిపారు.

Without Patel, Telangana would not have been freed quickly
Without Patel, Telangana would not have been freed quickly

కాంగ్రెస్‌ను క్షమించరు: కిషన్‌ రెడ్డి

ఈ కార్యక్రమంలోనే సశస్త్ర సీమబల్ అధికారుల నివాస సముదాయాలను అమిత్ షా ప్రారంభించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని… తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కూడా కేంద్రమంత్రి షా ప్రారంభించారు. తెలంగాణ స్వాతంత్య్ర దిగ్గజాలు షూబుల్లాఖాన్, రామ్‌జీ గోండ్‌లను స్మరించుకుంటూ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను అమిత్ షా ఆవిష్కరించారు. అంతకుముందు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోరాట చరిత్రను, స్ఫూర్తిని నాశనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు క్షమించరని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న సింధూతో భేటీ

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో అమిత్ షా భేటీ కానున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మర్యాదపూర్వకంగానే సింధును అమిత్ షా కలవనున్నారని వెల్లడించాయి. కానీ దీని వెనుక రాజకీయ కోణం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా సింధును అమిత్ షా కోరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. క్రీడా రంగంలో పీవీ సింధుకు మంచి పాపులారిటీ ఉంది. దేశం తరపున వివిధ టోర్నీలలో ఎన్నో పతకాలు సాధించింది. తెలుగు రాష్ట్రంలో పీసీ సింధు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. తమ పార్టీ కోసం సింధు మద్దతు కోరే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. సినీ, క్రీడా రంగాలకు సంబంధించిన ప్రముఖులతో అగ్ర నేతలు భేటీ అవుతున్నారు. గతంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విజయం సాధించినందుకు ఎన్టీఆర్‌ను ప్రశంసించడానికి అమిత్ షా కలిసినట్లు కాషాయ వర్గాలు బయటకు చెప్పినా.. ఈ భేటీ వెనుక పెద్ద వ్యూహమే ఉందనే ఊహాగానాలు వినిపించాయి. సౌత్ ఇండియాలో బీజేపీ అంత స్ట్రాంగ్ కాకపోవడంతో బలం పుంజుకోవాలని ఎప్పటినుంచో వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్‌ను అమిత్ షా కలిశారని, సౌత్ ఇండియాలో ఎన్టీఆర్ క్రేజ్‌ను బీజేపీ ఉపయోగించుకోనుందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఈ భేటీలో అసలు ఏం జరిగిందనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనలో యంగ్ హీరో నితిన్‌, టీమిండియా ఉమెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో భేటీ అయ్యారు. ఇలా వరుసగా సెలబ్రెటీలతో భేటీ అవుతూ వస్తుండగా.. ఇప్పుడు పీవీ సింధుతో అమిత్ షా నేరుగా సమావేశం కానుండటం కీలకంగా మారింది.  తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్