మహిళలకు సమాన అవకాశాలు అవసరం
జనాభాలో సగభాగమైన మహిళలకు పురుషులతో సమానంగా అన్నింటిలోనూ
అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఫోరెన్సిక్ లాబరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్
పసుపులేటి రజని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ మహిళా కమిటీ అధ్యక్షురాలు చామకూర
సుజాత అధ్యక్షతన ఆదివారం కాచిగూడలోని మున్నూరుకాపు భవన్ మ్యాడం
అంజయ్య హాల్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ
సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన
మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు. సీనియర్ సిటిజన్ మహిళలను
సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం
ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ మ్యాడం వెంకట్రావు, మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర
ప్రధానకార్యదర్శి ఆకుల నగేష్, మహిళా కమిటీ ప్రధానకార్యదర్శి నందిగామ
అన్నపూర్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు సమాన అవకాశాలు అవసరం
- Advertisement -
- Advertisement -



