- Advertisement -
చందాలు వేసుకొని మరీ విరాళం ఇచ్చిన మహిళలు.. బెంగాల్ లో కాంగ్రెస్ నేత ప్రచారంలో ఘటన*
ఎన్నికల ప్రచారంలో తిరిగే వాళ్లకు అభ్యర్థులు డబ్బులు ఇస్తారనే విషయం తెలిసిందే.. బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, ప్రచారం పూర్తయ్యాక ఐదొందలో వెయ్యో చేతిలో పెడతారు. కానీ ప్రచారానికి వచ్చిన ఓ అభ్యర్థికే జనం విరాళం ఇచ్చారు. బాగా డబ్బున్న వాళ్లు ఇచ్చారా అంటే అదీ కాదు.. రోజు కూలీలు, చిన్నాచితకా పని చేసుకునే పదకొండు మంది మహిళలే. కూలి పనులు చేస్తే వచ్చిన సొమ్ము, రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బు రూ.11 వేలను ప్రచార ఖర్చులకు అందించారు.
- Advertisement -