సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు
జగిత్యాల
మహిళా సాధికారతకు స్ఫూర్తియే మహిళా దినోత్సవం వేడుకలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.గురువారం తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా కార్యలయములో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు.ఈసందర్భంగా జిల్లాలో విశిష్ట సేవలు అందించిన మహిళలను,ఉత్తమ కొడళ్లను,ఉత్తమ మహిళా ఉద్యోగినిలను 36 మందిని మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ చేతుల మీదుగా పట్టు శాలువల్తో అవార్డులతో ఘనంగా సన్మానించారు.రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి మాట్లాడుతూ అన్నిరంగాల్లో పురుషులకు ధీటుగా మహిళలు దూసుకుపోతున్నప్పటికీ ఎక్కడో ఒక చోట వివక్షకు గురవుతున్నారని,దీనికి విరుగుడు లింగ సమానత్వమేనన్నారు. సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి జిల్లాఅధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ ఎక్కడ మహిళలు పూజింప బడుతారో అక్కడ దేవతలు కోలువై ఉంటారన్నారు.మహిళా చట్టాలపై వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జీ.ఆర్.దేశాయ్, సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం విజయ్,పి.హన్మంత రెడ్డి,
ఎండి.యకూబ్,కోశాధికారి వెలుముల ప్రకాష్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.ఆశోక్ రావుటీ బీసీ ఉపాధ్యక్షుడు సింగం భాస్కర్,జిల్లా మహిళా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి,కార్యదర్శి గంగం జలజ,సీనియర్ సిటీజేన్స్ పట్టణ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది పి.సతీశ్ రాజ్,వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి,వివిధ సంఘాల ప్రతినిధులు రాజ్ గోపాల్ చారి, విట్ఠల్,కండ్లే గంగాధర్,దుబ్బేశం,నారాయణ,నర్సయ్య,సుధాకర్,రామానందం,ఎండి.ఎక్బాల్,యూసుఫ్,తదితరులు పాల్గొన్నారు.