కేంద్ర పథకాల పేరు మార్చితే ఊరుకోం-కేంద్ర మంత్రి బండి సంజయ్

- Advertisement -

కేంద్ర పథకాల పేరు మార్చితే ఊరుకోం-కేంద్ర మంత్రి బండి సంజయ్

Wont Tolerate if names of central schemes are changed- Union Minister Bandi Sanjay

హైదరాబాద్
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదు. పేర్లు మార్చాలనుకుంటే మాత్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుంది. పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.
సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ మేం అన్యాయం చేయబోమని అన్నారు. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోంది కదా  గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది? ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు? రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ కు  నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివ్రుద్ధిపై చిత్తశుద్ధి లేదు. అభివ్రుద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. గత 10 ఏళ్లలో  12 లక్షల కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేసింది. గ్రామాల్లో జరిగిన అభివ్రుద్ది అంతా కేంద్ర నిధులతోనే. రైతు భరోసా, కమ్యూనిటీ హాల్, స్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానివే. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేనేలేదు. మండలానికి ఒక గ్రామంలోనే 4 పథకాలకు ఎంపిక చేసి లబ్ది చేయడమేంది? మిగిలిన గ్రామాల ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లేయలేదా? రాష్ట్ర ప్రజలకు ఇంత దుర్మార్గంగా చీటింగ్ చేస్తారా? రాష్ట్ర ప్రజలందరికీ లబ్ది చేకూరుస్తామని చెప్పి మండలానికి ఒక గ్రామానికి లబ్ది చేకూర్చడం నీచమని అన్నారు.
కాంగ్రెస్ నేతల జేబుల నుండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నారా? లేక పాకిస్తాన్..బంగ్లాదేశ్ నుండి తెచ్చి ఖర్చు చేస్తున్నారా? ప్రజలు కట్టిన పన్నులతోనే కేంద్రమైనా, రాష్ట్రమైనా ఖర్చు చేస్తోంది కదా? గతంలో పీఎం ఆవాస్ యోజన పేరుతో 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టకుండా ప్రజలను రోడ్డున పడేసింది నిజం కాదా? డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది నిజం కాదా? పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలి. గద్దర్ కు ఎట్లా పద్మ అవార్డులిస్తాం  ఎంత మంది బీజేపీ కార్యకర్తలను మట్టు పెట్టారో తెలియదా, వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తే. నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్, తెలంగాణ సెంటిమెంట్ తో ఎవరు లాభపడ్డారో ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్ధమైందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular