- Advertisement -
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ…
World Cancer Day Awareness Rally...
తిరుపతి
తిరుపతిలో మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్నూరు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ ప్రకాశం రోడ్ లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జరిగింది. బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ప్రసంగించారు…
ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని క్యాన్సర్ మహమ్మారి లక్షణాలను ముందుగా గుర్తించి వైద్యుల సూచనలతో సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడొచ్చని అన్నారు. క్యాన్సర్ కు మూల కారణాలైన మత్తు పదార్థాలు,సిగరెట్ స్మోకింగ్, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరగడం ఆందోళనకరమైన విషయం అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తున్నదన్నారు. ప్రజలు కూడా ప్రతినిత్యం కొంత సమయం ఆరోగ్యం పై దృష్టి సారించి వ్యాయామం దినచర్యగా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. క్యాన్సర్ అవగాహన ర్యాలీకి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించి ప్రసంగించిన నవీన్ కుమార్ రెడ్డిని శాలువతో పుష్పగుచ్చంతో అధ్యక్షులు దామోదర్ రెడ్డి సభ్యులు సత్కరించారు..
- Advertisement -