Friday, November 22, 2024

కరీంనగర్ అపోలో రీచ్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం….  

- Advertisement -
World Diabetes Day under the auspices of Karimnagar Apollo Reach....
World Diabetes Day under the auspices of Karimnagar Apollo Reach….

కరీం నగర్ : కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ ఆసుపత్రి అపోలో రీచ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ప్రపంచ మధుమేహ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణలోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలలో మరియు  అత్యాధునిక గుండె సంబంధిత వైద్య సేవలకు ప్రసిద్ధిగాంచిన అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వారి అనుబంధ సంస్థ అయిన అపోలో రీచ్ హాస్పిటల్ కరీంనగర్ లో గల  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో అత్యంత వైభవంగా కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ వారి భాగస్వామ్యంతో  అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం, వ్యాయామం యొక్క ప్రాధాన్యతలు తెలియజేస్తూ  ఒక కిలోమీటర్ పరుగు పందెం నిర్వహించడం జరిగినది.  సదరు కార్యక్రమంలో అపోలో రీచ్ హాస్పిటల్ యాజమాన్యం మరియు ఉద్యోగులు డాక్టర్ల బృందమైన డాక్టర్ చంద్రశేఖర్ ఎండి ఫిజీషియన్, డాక్టర్ తిరునాధర్ ఎండి ఫిజీషియన్,డాక్టర్ అనిల్ మూల్పూర్  కార్డియో తోరాసిక్ సర్జన్, డాక్టర్ సుబ్రత్ కుమార్  సురేన్  న్యూరో సర్జన్,  ఆర్ ఎం.ఓ. డాక్టర్ వాసు తోపాటు వివిధ ప్రముఖ వైద్య సంస్థలకు చెందిన వైద్యులైన ఫిజీషియన్ డాక్టర్ అజయ్ ఖండల్ గారు,  డాక్టర్ రాజకుమార్  క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు  మరియు కరీంనగర్ సైక్లిస్ట్ & రన్నర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పసుల మహేష్ తో పాటు  కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్ పరిపాలకులు డాక్టర్ నాగ సతీష్ గారు పాల్గొనడం జరిగింది.  ఇట్టి కార్యక్రమంలో సుమారు 300 పైచిలుకు వాకర్స్ కు  మరియు సాధారణ ప్రజానీకానికి  వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది  మరియు మధుమేహ వ్యాధికి సంబంధించి తీసుకోవాల్సిన నివారణ చర్యలు  అవలంబించాల్సిన అత్యున్నతమైన జీవన విధానాన్ని  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు సవివరంగా ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది.
హాస్పిటల్ పరిపాలకులు డాక్టర్ ఎస్ నాగ సతీష్ గారు మాట్లాడుతూ చికిత్స కన్నా  నివారణ వ్యాధి సంక్రమించడంలో ఎంతో తోడ్పడుతుందని అట్టి నినాదంతో అపోలో హాస్పిటల్, కరీంనగర్ వివిధ రకాలైన ముందస్తు వ్యాధి నిర్ధారణ హెల్త్ ప్యాకేజీలు ప్రజానీకానికి అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగ పరుచుకొని భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధుల నుండి కాపాడుకోవాల్సిందిగా తెలియజేశారు.  కరీంనగర్ , భగత్ నగర్ రెడ్డి అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని వారి వంతుగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వ్యాయామం యొక్క ప్రాధాన్యత ఈ సందర్భంగా తెలియజేయడమే కాకుండా  ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన అపోలో రీచ్ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్