21.2 C
New York
Friday, May 31, 2024

ఊరంతా చుట్టాలే !

- Advertisement -

కామారెడ్డి : ఊరంతా చుట్టాలే !

ఆ ఊర్లో అందరూ ఒకే సామజిక వర్గం
ఆపదొస్తే ఒకరికొకరు అండగా…
కామారెడ్డి జిల్లాలో ఆ ఊరు ప్రత్యేకం

ఆ ఊర్లో కుటుంబాలన్నీ ఒకే సామజిక వర్గానికి చెందినవి . ఇంటిపేరు వేరైనా , అన్ని కుటుంబాలతో బంధుత్వం ఉండే ఉంటుంది . ఎవరికీ ఏ ఆపద వచ్చిన ఒకరికొకరు అండగా నిలుస్తారు . ఏవైనా విభేదాలొస్తే అక్కడే పరిష్కరించుకుంటారు . కామారెడ్డి జిల్లా లో ఉన్న ఆ ఊరు.

మున్నూరు కాపుల కొటల్పల్లీ
కామారెడ్డి మండలం లో కొటల్పల్లీ గ్రామంలో 101 కుటుంబాలు ఉండగా జనాభా 425 . ఇక్కడ అన్ని మున్నూరు కాపు కులానికి చెందిన కుటుంబాలే ఉన్నాయి .255 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి . అందరు వ్యవసాయం అందునా ఆకూ కూరలు పండించడం లో సిద్దహస్తులు . మున్నూరు కాపు కులానికి చెందిన జొనకంటి,కల్లూరి ,ఆకుల ,బచ్చాగారీ ఇంటిపేర్లతో కుటుంబాలు ఉన్నాయి . దాదాపు అన్ని కుటుంబాలకు వ్యవసాయం భూమి ఉంది . అందరు వ్యవసాయం చేస్తారు . ఆ ఊర్లో అన్ని రాజకీయపార్టీలున్నా…ఎన్నికల వరకే రాజకీయాలు . ఆ తరువాత అందరు కలిసే ఉంటారు . ఏదైయినా విభేదాలు వస్తే స్థానికంగానే పరిష్కరించుకుంటారు . ఆ గ్రామం నుంచి గొడవలతో పోలీస్ స్టేషన్ దాక వెళ్లిన ఘటనలు తక్కువే .

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!