హుస్నాబాద్ డివిజన్ నూతన ఏసిపి గా పదవీ బాధ్యతలు చేపట్టిన యస్. సదానందం:
Y. Sadanand takes charge as the new ACP of Husnabad Division:
హుస్నాబాద్
హుస్నాబాద్ డివిజన్ నూతన ఏసిపి గా పదవీ బాధ్యతలు చేపట్టిన యస్. సదానందం, మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ కలసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపి. అభినందించి హుస్నాబాద్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని సూచించారు మరియు గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మరియు అసాంఘిక కార్యక్రమాల జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పిడిఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని సూచించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాలు జరగకుండా విసబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని తెలిపారు.
ఎసిపి వ్యక్తిగత వివరాలు:
1996 బ్యాచ్, ఎస్ఐ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేయడం జరిగింది.
సీఐగా వరంగల్ పిటిసి, ఉట్నూర్, అదిలాబాద్ జిల్లాలో పనిచేయడం జరిగింది.
ఏసీపీగా ప్రమోషన్ పొంది కరీంనగర్ ఇంటలిజెన్స్ లో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని, సోమవారం హుస్నాబాద్ ఏసిపి గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.


