- Advertisement -
మాలాధారులకు సామూహికంగా ఇరుముడి కట్టిన యాకయ్య గురుస్వామి
Yakayya Guruswami who built Irumudi collectively for the Maladhars
మణుగూరు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యప్ప స్వామి మాల ధరించి 41 రోజులు స్వాత్వికాహారం తీసుకుంటూ, ఏకభుక్తా భోజనం చేస్తూ కఠిననియమాలను పాటించి దీక్ష కాలం పూర్తి చేసిన స్వాములకు యాకయ్య గురుస్వామి ఆదివారం సామూహికంగా ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో స్వయంబుగా వెలసిన శ్రీశ్రీశ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో యాకయ్య గురుస్వామి అయ్యప్ప మాల ధరించిన 50 మంది స్వాములకు ఇరుముడి కడుతుంటే స్వామియే శరణం అంటూ అయ్యప్ప శరణాలతో ఆలయం ప్రతిధ్వనించింది. మునుపు ఎన్వడు లేని విధంగా శివాలయంలో జన జాతర తలపించి అయ్యప్ప శరణాలతో మారుమ్రోగింది. అనంతరం మాలాధారులకు ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాలు స్వాములు, భక్తులు స్వీకరించారు. ముందుగా శివాలయం పీఠంలో నిత్య పూజలో భాగంగా గణపతి, సుబ్రమణ్యం, నెయ్యాభిషేక ప్రియుడు నారికెళ్లస్వాములకు అష్టోత్తర నామాలతో గురుస్వామి విద్యాసాగర్ రెడ్డి గురుస్వామి యాకయ్యతో పూజలు చేయించారు. కఠిన నియమాలను ఆచరించి (41 రోజులు) మండల దీక్ష కాలం పూర్తి చేసిన మాలాధారులు అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతికరమైన అభిషేక ప్రియుడికి ఇరుముడి నెయ్యి సమర్పించేందుకు వివిధ వాహనాల్లో శబరిమలై బయలుదేరారు.
- Advertisement -