Sunday, September 8, 2024

య‌ష్‌రాజ్‌ఫిల్మ్స్ టైగ‌ర్‌3.. సెకండ్ ట్రాక్  ప్ర‌తి క‌ణం క‌ణంలో

- Advertisement -

మేజ‌ర్ ప్లాట్ ట్విస్ట్

య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్శ్‌లో ఎప్పుడూ సీక్రెసీ మేజ‌ర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ప్రేక్ష‌కుల్లో అమితాస‌క్తిని క్రియేట్ చేయ‌డానికి ఎప్పుడూ సీక్రెసీని బిల్డ్ చేస్తుంటారు మేక‌ర్స్. ఇప్పుడు టైగ‌ర్‌3లోనూ ఆదిత్య చోప్రా అలాంటిదే ప్లాన్ చేశారు. టైగ‌ర్‌3లోని రెండో పాట ప్ర‌తి క‌ణం క‌ణంలో ఉన్న మేజ‌ర్ ప్లాట్ పాయింట్‌ని సినిమాలో చూసి తీరాల్సిందేన‌ని అంటున్నారు ఆదిత్య చోప్రా.
ఈ పాట‌ను గురించి డైర‌క్ట‌ర్ మ‌నీష్ శ‌ర్మ మాట్లాడుతూ “టైగ‌ర్‌, జోయా మ‌ధ్య ఈ సినిమాలో అత్య‌ద్భుత‌మైన జ‌ర్నీ ఉంటుంది. వారిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మ‌రింత అన్యోన్యంగా అనిపిస్తాయి. ప్ర‌తి క‌ణం క‌ణం అందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌. ఈ పాట‌ను చాలా బాగా చిత్రీక‌రించాం. ఇందులోని దృశ్యాల‌ను, ఇలాంటి మ‌రికొన్ని కీల‌క అంశాల‌ను ప్రేక్ష‌కులు వెండితెర‌మీద అనుభూతి చెందాలి. ఆ క్ష‌ణాల్లో వారి ఆనందాన్ని మేం చూడాలి“ అని అన్నారు.

Yashraj Films Tiger 3.. Second Track in Every Cell
Yashraj Films Tiger 3.. Second Track in Every Cell

వీడియో సాంగ్‌ని హోల్డ్ చేయ‌డం గురించి చెబుతూ “చాలా సోల్‌ఫుల్ సాంగ్ ఇది. స‌ల్మాన్‌ఖాన్  మీద తెర‌కెక్కించిన ఇంత గొప్ప పాట‌ను ప్రేక్ష‌కుల‌కు రుచి చూప‌కుండా ఆప‌డం మాక్కూడా బాధ‌గానే ఉంది. కానీ కొన్నిసార్లు త‌ప్ప‌దు. ఎందుకంటే, వెండితెర మీద ఈ పాట‌ను చూసిన‌ప్పుడు, మేం ఎందుక‌లా చేయాల్సి వ‌చ్చిందో ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా అర్థ‌మ‌వుతుంది. ఆడియ‌న్స్‌కి ఆ ఎగ్జ‌యిట్‌మెంట్ అందించ‌డానికే ప్ర‌స్తుతం మేం ఈ ప‌ని చేస్తున్నాం“ అని అన్నారు.
స‌ల్మాన్‌ఖాన్‌, క‌త్రినా కైఫ్ న‌టించిన సినిమా టైగ‌ర్‌3. టైగ‌ర్‌, జోయా పాత్ర‌ల్లో త్రీక్వెల్‌లో అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు ఈ జంట‌. య‌ష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్శ్‌లో సినిమాటిక్ టైమ్‌లైన్‌లో విడుద‌ల‌వుతున్న ఐదో సినిమా ఇది. ఏక్‌తా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హై, వార్‌, ప‌ఠాన్ సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్