Saturday, February 15, 2025

జమిలీపై వైసీపీ ఆశలు

- Advertisement -

జమిలీపై వైసీపీ ఆశలు

YCP hopes on Jamili

విజయవాడ, డిసెంబర్ 16, (వాయిస్ టుడే)
జమిలి జపంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు అలర్ట్‌ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలపై వైసీపీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఏకంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు ఆపార్టీ అధినేత జగన్‌. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే.. ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ జమిలీ ఎన్నికలపై ఎంతో పట్టుదలగా ఉంది. ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అంటే జమిలి ఎన్నికలు ఖాయం అనుకోవచ్చు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్షహోదా కూడా దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు వైసీపీకి జమిలి రూపంలో ఆశలు మొగ్గలుతొడుగుతున్నాయి. జమిలి ఎన్నికలు వస్తే సత్తా చాటాలని వైసీపీ అప్పుడే కసరత్తులు మొదలుపెట్టిందట.జమిలి ఎన్నికలు 2027లో వస్తాయనే నమ్మకంతో రాజకీయ కార్యకలాపాలను మరింత స్పీడుగా నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా జగన్ జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. అది మన చేతుల్లో లేదు కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ కావాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. అంటే జమిలీ ఎన్నికలపై వైసీపీ మంచి ఆశలు పెట్టుకుంటోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.కానీ ముందే జమిలీ ఎన్నికలు వస్తాయన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే కేంద్రం తమ పదవీ కాలాన్ని తగ్గించుకుని ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. ఒకే సారి జమిలీ ఎన్నికలు పెట్టడం కష్టం అయితే.. వచ్చే సారి పాక్షిక జమిలీ.. ఆ తర్వాత పూర్తి స్థాయి జమిలి పెడతారు ఎలా చూసినా.. కేంద్రం తన పదవి కాలాన్ని మాత్రం తగ్గించుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు.జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఓ తేదీ అనుకుని ఆ తేదీ కన్నా ముందు పదవీ కాలం ముగిసిపోయే రాష్ట్రాల పదవీ కాలం పెంచాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించాలి. మరోవైపు పదవీ కాలం అయిపోయే వారి పదవీ కాలం తగ్గించాలి. ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఏ తేదీ అనుకుంటారంటే.. సహజంగా.. పార్లమెంట్ ఎన్నికలు జరిగే తేదీనే అనుకుంటారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. కాస్త ముందుగా ఐదు రాష్ట్రాలు. ఆ తర్వాత మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. అలా అన్నింటినీ కలిపితే సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు కలసి వస్తాయి. అంటే.. కేంద్రం పదవీ కాలం తగ్గించకోవాల్సిన అవసరం ఉండదు.జమిలీ ఎన్నికలు ఖాయమే అయినా ముందస్తుగా వస్తాయన్నది మాత్రం వైసీపీ ఊహేనని ఏపీ కూటమి అంటోంది. పార్టీ క్యాడర్ ఇనాక్టివ్ కాకుండా ఉండేందుకు జగన్ తో పాటు వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. పార్టీని కాపాడుకునేందుకు నేతల్లో జమిలి ఆశలను పెంచుతుందని కొట్టిపారిస్తున్నారు.
ఇదిలా ఉండగా జమిలీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. జమిలి ఎన్నికలు అమల్లోకి వచ్చినా.. అమలు జరిగేది 2029 సంవత్సరంలోనే అన్నారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని విమర్శించారు.నిజానికి ఏపీ ప్రజలు మొన్ననే తీర్పు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలే అయ్యింది. ఇంతలోనే ఎన్నికలు వచ్చేయాలని వైసీపీకి ఇంత ఉబలాటమెందుకనే వాదన రాజకీయ వర్గాల్లో పడుతుండటం సరైన అభిప్రాయమేనా అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్