Saturday, December 14, 2024

కూటమి వైపు వైసీపీ చూపులు

- Advertisement -

కూటమి వైపు వైసీపీ చూపులు

YCP looks towards Kutami

విజయవాడ, డిసెంబర్ 14, (వాయిస్ టుడే)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏదో ఓ కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి నేతృత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ వైదొలిగి మమతా బెనర్జీ నాయకత్వంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను సిద్దమేనని మమతా బెనర్జీ ప్రకటించిన తర్వాత అనూహ్యంగా పలు పార్టీలు మద్దతు పలికాయి.  ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు దీదీ నాయకత్వానికి ఓకే అంటే సరే అనుకోవచ్చు కానీ జగన్ నేతృత్వంలోని వైసీపీ కూడా మద్దతు పలికడం రాబోతున్న మార్పులకు సూచనగా మారింది. ప్రస్తుతం ఇండియా కూటమి చీలిక దిశగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలసి పని చేసేందుకు సిద్ధంగా లేదు. హర్యనా ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ ను పట్టించుకోలేదు. ఇప్పుడు ఆప్ .. కాంగ్రెస్ ను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ను కాదని ప్రాంతీయ పార్టీల నేతలే కూటమికి నేతృత్వం వహించాలని కోరుకుంటున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వంటి వారు ఈ డిమాండ్ ను సమర్థిస్తున్నారు. ఇతర పార్టీలు కూడా ఓకే అంటే.. నాయకత్వం మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపై కూటమిని నిర్మించే బాధ్యత ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే అవకాశాలనుపరిశీలించే చాన్స్ ఉందని అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి ఇండియా కూటమికి దీదీ నాయకత్వం వహిస్తే బాగుంటుందని ప్రకటించేశారు. మామూలుగా అయితే ఆ కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తే మాకేంటి అంటారు కానీ ఆయన తీరు మాత్రం వేరుగా ఉంది. ప్రస్తుతం వైసీపీ అత్యంత బలహీనంగా ఉంది.  అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఈ పరిస్థితులు చూస్తే రానున్న రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిని ఎదుర్కోవాలంటే తమకు ఓ కూటమి మద్దతు ఉండాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరడానికి ఇంత కాలం సంశయిస్తూ వస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ మినహా మిగతా ఇండియా కూటమి పార్టీలన్నీ హాజరయ్యాయి. ఇప్పుడు ఆ వ్యూహం వెనుక ఉన్న రాజకీయం వెలుగులోకి వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలో త్వరలో ఇండియా కూటమి పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదో కానీ.. వైసీపీ చేరడం మాత్రం పక్కా అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. మమతా బెనర్జీ కూడా నేరుగా జగన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ఇంత కాలం బీజేపీతో లొల్లి పెట్టుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడని జగన్ ఇప్పుడు ఆ పార్టీని నమ్మడానికి సిద్దంగా లేరు. అందుకే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారన్న అభిప్రాయం ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. రానున్న ఐదేళ్లు పార్టీ నుంచి మరిన్ని ఒత్తిళ్లు ఉంటాయని భావిస్తున్నారట. పార్టీలో ఉండి కష్టాలు కోరి తెచ్చుకునే కంటే, రాజీనామా చేస్తే బెటరని అనుకుంటున్నారు. ఇటు పార్టీకి.. అటు ప్రభుత్వానికి దూరంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండదన్నది ఆయా నేతల ఆలోచన.మరికొందరికి సొంత నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. అధిష్టానం వద్ద ఎంత మొరపెట్టుకున్నా, ఫలితం లేకపోయింది. ఫలితంగా ఫ్యాన్‌కి దూరంగా ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఇంకొందరు నేతలు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.ప్రస్తుతం కూటమి సర్కార్‌కు కేంద్రం నుంచి అన్నివిధాలుగా సహాయ సహకారాలున్నాయి. కూటమిలో చీలిక వచ్చే ప్రసక్తి లేదని భావిస్తున్నారు. ఒకవేళ వైసీపీ పుంచుకున్నా, మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని, కాకపోతే బలమైన ప్రతిపక్షంగా తయారు కావచ్చనే అంచనాలు లేకపోలేదు. ఆ లెక్కన దాదాపు పదేళ్లు ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి ఉంటుందన్నమాట.ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే టీడీపీ, లేదంటే జనసేన, ఇంకా లేదంటే బీజేపీ వైపు వెళ్తే సేఫ్‌గా ఉండవచ్చని భావిస్తున్నారట. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో బెటర్ లైఫ్ ఉంటుందనేది నేతల భావన. రాబోయే ఐదేళ్లలో వైసీపీలో ఉండేదెవరు? వెళ్లిపోయేదెవరు? ఎందుకు ఆయా నేతలను ఆపే ప్రయత్నం చేయలేకపోతోంది? మొత్తానికి రాబోయే ఐదేళ్లు మాత్రం వైసీపీ గడ్డుకాలమేనని చెప్పక తప్పదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్