Tuesday, January 14, 2025

పొత్తులు దిశగా వైసీపీ అడుగులు

- Advertisement -

పొత్తులు దిశగా వైసీపీ అడుగులు

YCP steps towards alliances

విజయవాడ, డిసెంబర్ 17, (వాయిస్ టుడే)
వచ్చే ఎన్నికల్లో వైసిపి పొత్తులు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి. గతం మాదిరిగా ఒంటరి ప్రయాణం అంటే కుదిరే పని కాదు. అధికార పక్షం మూడు పార్టీలతో పటిష్టంగా ఉంది. వారి మధ్య ఇప్పట్లో విభేదాలు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కచ్చితంగా కలిసి వెళ్తాయి. వైసిపి ఒంటరి ప్రయాణం చేస్తే.. గతం మాదిరిగా కాంగ్రెస్, వామపక్షాలు కలుస్తాయి. అయితే ఓట్లు వాటికి రాకున్నా.. జగన్ ను ఎంత నష్టం చేయాలో అంతలా చేస్తాయి. ఆపై అధికారపక్షం దూకుడుగా ఉంటుంది. కేంద్రం సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఏదో ఒక పార్టీ దన్ను వైసిపికి అవసరం. అందుకు పొత్తులు కూడా కీలకం. మాటకు మాట తోడవుతుంది. అధికార పక్షానికి నిలదీసే గొంతు బలపడుతుంది. అందుకే జగన్ పొత్తులపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలతో కలిసి వెళ్తే ఓటు శాతం పెంచుకోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. తాజాగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. పార్టీలో పొత్తుల గురించి అధినేత జగన్ నిర్ణయం తీసుకుంటారని తాజాగా వ్యాఖ్యానించారు సాయి రెడ్డి. దీంతో పొత్తుల ఆలోచనతో వైసిపి ఉన్నట్లు అర్థమవుతోంది.ఇప్పటివరకు సెంటిమెంటుతో పాటు ప్రత్యేక రాజకీయ పరిస్థితులు వైసీపీకి కలిసి వచ్చాయి.ఒక విధంగా చెప్పాలంటే అది జైత్రయాత్రే. 2011లో ఆవిర్భవించింది వైసిపి. అప్పట్లో వైయస్సార్ మరణం విపరీతమైన సానుభూతి ఇచ్చింది. 2012లో జరిగిన 30 ఎన్నికల్లో అయితే జగన్ జైలుకు వెళ్లిన సానుభూతి బలంగా వర్కౌట్ అయ్యింది. 2014 ఎన్నికల్లో ఒక ఊపు వచ్చింది. వైసిపి అధికారంలోకి రాబోతుందన్న చర్చ నడిచింది. 67 స్థానాలతో గౌరవప్రదమైన స్థానాలను సైతం పొందింది వైసిపి. 2019లో అయితే జగన్ కు ఒకసారి ఛాన్స్ ఇద్దామని ప్రజలు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. జగన్ ను సీఎం చేయాలని వైసీపీ శ్రేణులు సైతం కసితో పని చేశాయి. అయితే అదే ధోరణితో, అదే ధీమాతో ఒంటరి పోరాటం చేశారు జగన్ ఈ ఎన్నికల్లో. దారుణంగా దెబ్బతిన్నారు. కానీ ఈసారి పొత్తు లేకుండా ముందడుగు వేయడం ప్రమాదకరమే.దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల సరళి పరిశీలిస్తే పొత్తులే అధికం. పొత్తు లేకుండా ముందుకు సాగితే ఆ పార్టీలకు ప్రమాదకరమే. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండే పార్టీలు తప్పనిసరిగా ఇతర పార్టీలను కలుపుకెల్లాలి. లేకుంటే మాత్రం ఓటు చీలి అధికారపక్షానికి భారీ లబ్ది చేకూరుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కనిపిస్తున్నాయి. వామపక్షాలు బలహీనపడినా.. ప్రజా సంఘాలు, ప్రజా పోరాటాల్లో కీలక భూమిక పోషిస్తున్నాయి. అలా వామపక్షాలను కలుపుకెళ్తే ప్రభుత్వ వ్యతిరేకతను పెంచవచ్చు. ఇక కాంగ్రెస్ ను కలుపుకొని వెళ్తే.. ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు మొత్తం టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీలో ఉన్నది కూడా కాంగ్రెస్ క్యాడర్ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అయితే గతం మాదిరిగా సింహం సింగిల్ గా వస్తుంది. అన్న నినాదాన్ని విడిచిపెడితేనే వైసీపీకి భవిష్యత్తు. లేకుంటే ఒంటరి పోరాటం అంటే మూల్యం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్