మీకు దమ్ము లేదు. ఇంత మంది వచ్చి కూడా నా వెంట్రుక కూడా పీకలేదు

- Advertisement -

మీకు దమ్ము లేదు. ఇంత మంది వచ్చి కూడా నా వెంట్రుక కూడా పీకలేదు

You have no guts, Even though so many people came, I did not even pluk my hair

 బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్లు దాడి చేస్తే ఎవడూ భయపడేటోడు లేడు
రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం కౌశిక్ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్ సెప్టెంబర్ 12
ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల వివాదం ముదురుతోంది. తన ఇంటిపై అరెకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీకు దమ్ము లేదు. ఇంత మంది వచ్చి కూడా నా వెంట్రుక కూడా పీకలేదు. తెలంగాణ బిడ్డలం. బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్లు దాడి చేస్తే ఎవడూ భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం’ అని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.కాగా, తన అనుచరులతో కలిసి అరికెపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి నిరసన చేపట్టారు. ఈక్రమంలో ఆయన అనుచరులు.. కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు,టమాటాలతో దాడి చేశారు. ఇంటి కిటికీలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అరికెపూడి గాంధీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular