రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి.. శత్రువులుగా ఉండొద్దు
రాజకీయ నాయకులు క్రీడాకారుల నుంచి గెలుపోటముల స్ఫూర్తి నేర్చుకోవాలి
రాజకీయాల్లో శతృత్వం పెరుగుతొంది
కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్
కరీంనగర్
అథ్లెటిక్ క్రీడాకారుల కోసం పార్లమెంటు సభ్యునిగా ₹7కోట్ల నిధులు తీసుకొచ్చాను
రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి కానీ…శత్రువులుగా ఉండొద్దని…రాజకీయ నాయకులు క్రీడాకారులను చూసి నేర్చుకోవాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ని ఇండోర్ స్టేడియంలో కరీంనగర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమేంట్ ను శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని….ఓటమి చెందిన క్రీడాకారుడు పట్టుదలతో సాధన చేసి మళ్లీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాడని పేర్కొన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించిన్నప్పుడే క్రీడల్లో రాణిస్తారని…రాజకీయ నాయకులు కూడా క్రీడాకారులను చూసి గెలుపోటములను సమానంగా తీసుకోవాలి కానీ శతృత్వం పెంచుకోవద్దన్నారు.
గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని పేర్కొన్నారు.పార్లమెంట్ సభ్యునిగా తాను అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం₹ 7 కోట్లతో సింథటిక్ ట్రాక్ వేసినట్లు పేర్కొన్నారు.
బ్యాడ్మింటన్ అసోసియేషన్ నాయకులు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ జితేందర్ రెడ్డి, అదనపు ఎస్పీ వెంకట్రావు, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, శంకరపట్నం జడ్పీటీసి శ్రీనివాస్ రెడ్డి,