ఒట్టేసి దేవుడితో రాజకీయాలు చేసే మీరా…
బీజేపిని విమర్శించేది?
అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా…. నన్ను ఓడించేది?
బండి సంజయ్
‘‘ఇక్కడున్న కొందరు నోటి దురద ఉన్న కాంగ్రెస్ నాయకులు దేశం, ధర్మం గురించి మాట్లాడితే నాకేం పనిలేదని కించపర్చేలా మాట్లాడుతున్నరు. మరి ముఖ్యమంత్రి ఎక్కడికిపోయినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నడు. గద్వాల పోయి జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేస్తరు. యాదాద్రి పోయి లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టేస్తరు..వరంగల్ పోయి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు.. వాళ్లు మాట్లాడితే కరెక్టట. నేను మాట్లాడితే తప్పట… ఇదేం న్యాయం?. నేను వాళ్ల లెక్క దేవుడిపై ఒట్టేసి హామీలు అమలు చేయకుండా మోసం చేయడం లేదు. దేశం కోసం, ధర్మ రక్షణ కోసం పోరాడుతున్న’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా నేటికీ తేల్చుకోలేని నాయకులు తనను ఓడిస్తానని బీరాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.‘‘ఇక్కడున్నాయన పార్టీకి, సీఎంకు చెప్పకుండా వెలిచాల రాజేందర్ ను తీసుకుపోయి నామినేషన్ వేయిస్తడు. ఈ విషయం తెలిసి సీఎం, హైకమాండ్ గరం అయితున్నరు. ఇయాళ పోటీగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా నామినేషన్ వేస్తడట.. రేపే నామినేషన్లకు ఆఖరు తేదీ. ఇప్పటి వరకు అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా తేల్చుకోలేకపోతున్న నేతలు నాపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.
ఈరోజు చొప్పదండి విచ్చేసిన బండి సంజయ్ కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు, ముదిరాజ్ సంఘం మంద శ్రీరాం ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను, కేంద్రంలోని నరేంద్రమోదీ సహకారంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివ్రుద్ధిని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని కోరుతున్నా.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఓటేసి ప్రజలు మోసపోయారు.
నరేంద్రమోదీ హామీలివ్వకుండా అధికారంలోకి వచ్చినా ప్రజలకు అవసరమైనవన్నీ చేస్తున్నడు. మోదీ చేసిందే చెబుతారు. చెప్పిందే చేస్తారు..
ఇక్కడున్న కొందరు నోటి దురద ఉన్న కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ దేశం, ధర్మం గురించి దేవుడి గురించి మాట్లాడితే ఆయనకేమీ ఏమీ పనిలేదు. దేశం, ధర్మమంటూ మత రాజకీయాలు చేస్తున్నాడని విమర్శిస్తారు.. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నడు. జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేస్తరు. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టేస్తరు..వరంగల్ పోయి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు.. వాళ్లు మాట్లాడితే కరెక్టట. నేను మాట్లాడితే తప్పట… ఇదేం న్యాయం?
ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తారట. ఎన్నికల్లోపే ఎందుకు చేయలేదు. పోనీ ఎన్నికల కోడ్ అయిపోగానే జూన్ 4న రుణమాఫీ చేయొచ్చు కదా.. ఎందుకు చేయరు? పార్లమెంట్ ఎన్నికలైపోంగనే స్థానిక సంస్థలు కూడా నిర్వహించి ఓట్లు దండుకున్నా.. రుణమాఫీసహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేయాలని ప్రభుత్వం ప్లాన్ వేసింది. అందుకే ఈ కపట నాటకమాడుతూ దేవుడిమీద ఓట్టేసి రాజకీయం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ హామీలివ్వకపోతే… అవి నెరవేర్చేదాకా కొట్లాడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. బోనస్ ఇచ్చేదాకా వెంటాడతాం. తాలు, తరుగు, తేమతో పని లేకుండా వడ్లు కొనాలంటే రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయి. వడ్లకు బోనస్ కోసం రూ.3,500 కోట్లు అవసరమవుతాయి. వీటినే ఖర్చు చేయలేనోళ్లు రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తానంటే నమ్మేదెవరు? వీటి కోసం కొట్లాడి కాంగ్రెస్ మెడలు వంచేదాకా పోరాడేది బీజేపీయే. కేసీఆర్ సర్కార్ మోసాలను ఎండగట్టి ఫాంహౌజ్ లో పడుకున్నోడిని ధర్నా చౌక్ కు గుంజుకొచ్చినానే అక్కసుతో నన్ను ఓడగొట్టాలని కుట్ర చేస్తున్నడు.
అదే విధంగా 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ను నిలదీస్తుంటే… నన్ను ఓడించాలని బీఆర్ఎస్ తో కలిసి ఇక్కడున్న కాంగ్రెస్ నేతలు కుట్ర చేస్తున్నరు.. నేనడుగుతున్న నేనడుగుతున్నా… మహిళలకు నెలనెలా రూ.2,500లు బ్యాంకులో జమ చేస్తామన్నరు. ఎందుకు ఇవ్వలేదు? వ్రుద్దులు, వితంతవులు, బీడీ కార్మికులకు పెన్షన్ ను 4 వేలకు పెంచి నెలనెలా ఇస్తామని ఎందుకివ్వలే? ఇండ్లు లేని వాళ్లందరికీ ఇంటిజాగాతోపాటు 5 లక్షల సాయమందిస్తామని ఇంతవరకు ఒక్కరికైనా ఇచ్చారా? రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా కింద 15 వేల ఆర్దిక సాయం, రైతు కూలీలకు 12 వేల సాయమందిస్తామన్నారు. రైతులు అల్లాడుతున్నా ఎందకు బోనస్ ఇవ్వలేదు? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చి చదువుపై భారం పడకుండా చూస్తామన్నారు. ఒక్కరంటే ఒక్క విద్యార్ధికైనా భరోసా కార్డు ఇచ్చారా?రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తాం. వడ్లు, మిర్చి, మొక్కజొన్న, మిర్చి, పసుపు సహా పంటలకు క్వింటాలుకు 5 వందల చొప్పన బోనస్ ఇస్తామన్నరు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర ఇచ్చి వడ్లను కొనుగోలు చేస్తామన్నరు. వడ్ల కల్లాల వద్ద రైతులు అల్లాడుతున్నరు. ఎంతమందికి బోనస్ ఇచ్చారు? ఎంత మంది వద్ద తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లు కొన్నారు? బీఆర్ఎస్ హయాంలో మూసివేసిన 6 వేల స్కూళ్లను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని స్కూళ్లు తెరిపించారు?స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో నిధులు, విధులు అప్పగిస్తామన్నారు. ఎన్ని నిధులిచ్చారు?
మోదీ బాత్రూంలే కాదు.. అన్ని కట్టించిండు. మోదీ ఇండ్ల కోసం నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించిండు. పంచాయతీలకు వేల కోట్ల నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించిండు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా బియ్యం ఇస్తుంటే కేసీఆర్ బొమ్మలు పెట్టుకున్నరు… ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ రాచిరంపాన పెట్టిండు. మోదీని విమర్శిస్తున్న ఇక్కడున్న కాంగ్రెస్ నేత(పొన్నంను ఉద్దేశించి) ఆనాడు ఎందుకు కేసీఆర్ పై కొట్లాడలేదు? ప్రజలు ఆనాడు అల్లాడుతుంటే ఈ నేత యాడ పడుకున్నడు? మోదీ చేసిన అభివ్రుద్ధి పనులన్నీ ఆ నాయకుడికి కన్పించడం లేదు. మోదీ బాత్రూంలు కడితే ఓట్లేస్తరా? అని చులకన ఆ నేతను అడుగుతున్నా… 57 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ బాత్రూంలు కూడా కట్టియ్యకుండా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే… మోదీగారు అందరికీ బాత్రూంలు కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహా నాయకుడు.
కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో నేటికీ తెలియదు. ఒకాయన పార్టీకి, సీఎంకు చెప్పకుండా వెలిచాల రాజేందర్ ను తీసుకుపోయి నామినేషన్ వేయించాడట. ఈ విషయం తెలిసి సీఎం, హైకమాండ్ గరం అయ్యిందట. ఇయాళ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా నామినేషన్ వేస్తడట.. రేపే నామినేషన్లకు ఆఖరు తేదీ. కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా తేల్చుకోలేకపోతున్న నేతలు బీజేపీని ఓడిస్తామని బీరాలు పలుకుతుంటే నవ్వొస్తుంది.