మీ కోసం మీ ఎమ్మెల్యే…
Your MLA for you...
శానిటేషన్ విజిట్ చేపట్టిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకునేందుకే పర్యటిస్తున్నా: ఎమ్మెల్యే రాము
దైవంలా పూజించే ఆవులను యదేచ్ఛగా రోడ్లపై వదలవద్దు. ఉదయపు పర్యటనల్లో ప్రజలు భాగస్వామ్యలు కావాలి.
గుడివాడ నవంబర్ 25:
ప్రజా ప్రతినిధి అంటే వారి ఓట్లతో గెలిచి నోట్లు సంపాదించడం కాదని.. వారి సమస్యలు చూసి వాటిని పరిష్కరించేందుకు కృషి చేసే వాడని ప్రజలు గుర్తించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేస్తున్నారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే రాము..మీ కోసం మీ ఎమ్మెల్యే శానిటేషన్ విజిట్ చేపట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకోడానికి ఉదయం అయన స్వయంగా పట్టణంలోని పలు వార్డులలో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తున్నారు. వార్డులలో పారిశుధ్య సమస్యలు,తాగునీటి సమస్య లు తెలుసుకుని అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యలను పరిష్కరిస్తున్నారు. పర్యటంలో భాగంగా పలు ప్రాంతాల్లో శానిటేషన్ లోపాలను గుర్తించిన ఎమ్మెల్యే రాము.. సమస్య పరిష్కారానికి కారణమేంటని స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న తరువాత కనిపించకుండా పోయే నేతలు ఉన్న ఈ తరుణంలో మంది మర్భలం లేకుండా ఎమ్మెల్యే రాము ఒక్కడే మోటార్ బైక్ ఫై పట్టణం లో పర్యటిచడం ప్రజలలో రాముపై నమ్మకాన్ని పెంచుతోంది. ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకునేందుకు ఉదయపు పర్యటన చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాము తెలియచేశారు. పర్యటనలో భాగంగా పట్టణాభివృద్ధికి ప్రజల నుండి సూచనలు కూడా తీసుకుంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
ప్రధానంగా మనం ఎంతో పవిత్రంగా పూజించే ఆవులను రోడ్లపై వదలడం బాధాకరమన్నారు. రోడ్లపై తిరుగుతున్న ఆవులు వ్యర్ధాలను, తినడం వల్ల అవి అనారోగ్యాల పాడవుతున్నాయన్నారు. కొందరి తమ స్వార్థానికి రోడ్లపై గోవులను వదలడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి వాహనదారులు గాయపడుతున్నారని రాము ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తాను నిర్వహించే పర్యటనల్లో ప్రజలు భాగస్వాములై.. పట్టణాభివృద్ధికి తమ సూచనలు.. సలహాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.