Sunday, September 8, 2024

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

- Advertisement -

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి,

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.  బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు వయోవృద్దులు, దివ్యాన్గుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన  ర్యాలిని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,  మత్తుకు అలవాటు పడి విలువైన నిండు జీవితాన్ని పాడు చేసుకోవద్దని అన్నారు.  మాదక ద్రవ్యాలు అలవాటు వల్ల  అవయవాలు దెబ్బ తిని ఆరోగ్యం దెబ్బతిని కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని అన్నారు.   గంజాయి, మత్తు పదార్థాలు సేవించే వ్యక్తులు మానసికంగా కృంగిపోతానికి, నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతిని ఆరోగ్యం క్షిణించి పోతుందని తెలిపారు. జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైనదని
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలన్నారు. ఉపాధ్యాయుల సలహాలు,  సూచనలు పాటిస్తూ చక్కగా చదువుకొని దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు.
తల్లిదండ్రులు సైతం తమ పిల్లల వ్యవహార శైలిని పరిశీలిస్తూ ఉండాలని మత్తు పదార్థాలు అలవాటు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపిందని విద్యార్థి దశ నుంచి మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీన అంతర్జాతీయ
మాదక ద్రవ్యాలు,  అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంతున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మాదక ద్రవ్యాల వినియాగం అలవాటు ఉన్న వ్యక్తుల సమాచారం పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖల సిబ్బందికి తెలియ చేయాలని సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యముగా ఉంచుతామని తెలిపారు.

ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ
మత్తు పదార్థాలు సేవించడం వల్ల శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని యువత, విద్యార్థులు గంజాయి తదితర  మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల  మానసిక స్థితి సరిగా లేక నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాలలో కొందరు వ్యక్తులు డబ్బు సంపాదన ధ్యేయంగా యువతకు మత్తుపదార్థాలు  చాక్లెట్ల తదితర తినుబందారాల రూపంలో అలవాటు చేస్తున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పోలీస్ శాఖ తరపున నిత్యం గంజాయి ఇతర మత్తు పదార్థాలు రవాణా చేసే వ్యక్తులు విక్రయించే వ్యక్తులపై నిత్యం ఏదో ఒకచోట కేసులు నమోదు చేస్తూనే ఉన్నామని అన్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు యువత గంజాయి మత్తు పదార్థాలు సేవిస్తే జరిగే అనర్ధాలుపై అవగాహన కలిగి వుండాలనీ ఎక్కడైన గంజాయి, మత్తు పదార్థాలు సేవించే వ్యక్తులు గాని విక్రయించే వ్యక్తులు వివరాలు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నాగేశ్వరరావు,  జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్,  విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్, ఆర్డిఓ మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సామాజమే లక్ష్యంగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేపించారు.
============================

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్