Sunday, September 8, 2024

వైఎస్ పాలన వేరు.. జగన్ పాలన వేరు

- Advertisement -

వైఎస్ పాలన వేరు.. జగన్ పాలన వేరు

విజయవాడ, జనవరి 26

ఏదో ఆశించి తాను పాదయాత్ర చేయలేదని.. ఏదో ఆశించి ఎప్పుడూ తన అన్న జగన్ వద్దకు తాను వెళ్లలేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల  అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆమె పాల్గొని.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. ఎవరో తనకు కితాబు ఇస్తే తన విలువ ఎక్కువ కాదని.. కితాబు ఇవ్వకపోయినా తన విలువ తక్కువ కాదని అన్నారు. ‘నేను వైఎస్సార్ రక్తం. రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిల కాకుండా ఎలా పోతుంది.?. నా కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నా. నాకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవరెడ్డి కూడా నేను అడిగి పాదయాత్ర చేశానని మాట్లాడారు. భారతమ్మ చేయాలనుకున్న పాదయాత్ర నేను చేశానట. స్వార్థం కోసమే పాదయాత్ర చేశానని అంటున్నారు. మీ ఆరోపణలు నిజం కాదని నేను ప్రమాణం చేయగలను. మీరు చేయగలరా.?. మేము అక్రమ సంపాదనకు స్కెచ్ వేశామని అంటున్నారు. నా భర్త అనిల్ ఒక్కరోజు కూడా జగన్ ను కలవలేదు. అధికారంలోకి వచ్చాక నేను మా అమ్మ విజయమ్మతో ఒక్కసారి మాత్రమే జగన్ వద్దకు వెళ్లాను. ఇవాళ్టి వరకూ ఏదీ ఆశించి నేను జగన్ వద్దకు వెళ్లలేదు. అందుకు మా అమ్మే సాక్ష్యం. దమ్ముంటే విజయమ్మను అడగండి. వైఎస్సార్ ఆశయ సాధన కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను.’ అని షర్మిల వ్యాఖ్యానించారు.అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని.. ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదని షర్మిల అన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు వంద శాతం పెరిగాయని మండిపడ్డారు. అంబేడ్కర్ గురించి గొప్పలు చెప్పడం కాదని.. ఆయన ఆశయాలను అమలు చేయాలని హితవు పలికారు. ‘కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకున్నారు. దళితులపై కపట ప్రేమ చూపే వారికి  తగిన బుద్ధి చెప్పాలి. ప్రాంతీయ పార్టీల బడుగు, బలహీన వర్గాలను సమానంగా చూడడం లేదు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలకు మద్దతు తెలపబోమని ప్రజలు ప్రమాణం చేయాలి.’ అని పిలుపునిచ్చారు. అనంతరం, కృష్ణా జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో షర్మిల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు గిడుగు రుద్రరాజు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, కొప్పుల రాజు, పల్లం రాజు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్