న్యూఢిల్లీ
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెపార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. బుధవారం సాయంత్రం షర్మిల విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో షర్మిల చేరారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని ఆమె అన్నారు. ఆయన బిడ్డగా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్సార్ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరిక్షణం వరకూ పార్టీకి సేవ చేశారని గుర్తుచేశారు. ఈరోజు దేశంలోనే అతిపెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ టీపీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన తండ్రి వైఎస్సార్ కల అని, ఆ కలను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల వివరించారు.
కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల
- Advertisement -
- Advertisement -