వైఎస్ షర్మిలా రెడ్డి కి ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ?
గురువారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం
న్యూ ఢిల్లీ డిసెంబర్ 27
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.? ఇప్పటికే ఢిల్లీలో షర్మిల భర్త అనిల్ కుమార్ అన్నారు. రేపు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది? ముందు ఏఐసీసీలో సర్దుబాటు చేయాలని షర్మిల విజ్ఞప్తి చేస్తున్నారు.కాగా.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని ఏబీఎన్‌తో ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ అన్నారు.”వైఎస్ఆర్ బిడ్డగా షర్మిల అంటే మాకు గౌరవం ఉంది. షర్మిలకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చేదీ అధ్యక్షుడు ఖర్గేనే నిర్ణయం తీసుకుంటారు.” అని మాణిక్యం ఠాకూర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి త్వరలో షర్మిల?. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాకను ఏపీ కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఎవరు వచ్చినా స్వాగతిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
వైఎస్ షర్మిలా రెడ్డి కి ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ?
- Advertisement -
- Advertisement -