అక్రమంగా తరలిస్తున్న 19 గోవుల పట్టివేత

- Advertisement -

By ఆముదాల వెంకన్న

నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోల్ ప్లాజా వద్ద శనివారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రెండు టాటా ఏసీ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 19 గోవులను పట్టుకున్నారు. అనకాపల్లి జిల్లా అక్కపల్లి నుంచి హైదరాబాద్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా గోవులను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్టు చేసినట్లు నేలకొండపల్లి ఎస్సై శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పట్టుబడిన గోవులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గోశాలకు తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular