ఇందిరానగర్‌లో వీధి కుక్కల బెడద.. వాహనదారుల బెంబేలు

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మం: నగరంలోని ఇందిరానగర్ మెయిన్ రోడ్డు, రోడ్ నెం.7 ప్రాంతంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారింది. రాత్రివేళ గుంపులుగా సంచరిస్తూ ద్విచక్ర వాహనదారుల వెంటపడి దాడులకు యత్నిస్తున్నాయి. కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. పాదచారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. సమస్యపై మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular