- Advertisement -
ఐఎఫ్ టి యు రాజకీయ క్లాసులను జయప్రదం చేయాలి
IFTU should win over the political classesఐఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి ఎం దానవరప్రసాద్ పిలుపు
తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 14
శేష మహాల్ సెంటర్లో ఈనెల 21 , 22 తేదీల్లో జరిగే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఐ ఎఫ్ టి యు జిల్లాకాసులను జయప్రదం చేయాలని కోరుతూ ప్రచారం చేయడం జరిగింది .ఈ సందర్భంగా దానవరప్రసాద్ మాట్లాడుతూ కార్మిక వర్గానికి ,రాజకీయంగా చైతన్యం చేయడానికి ఈ క్లాసులు నిర్వహిస్తున్నామని, ఈ క్లాసులలో జాతీయ అంతర్జాతీయ విషయాలు, చరిత్రక భౌతిక వాదం ,కార్మిక రంగంలో ఐఎఫ్టియు కార్యకర్తల పని విధానం ,వీటిపై చర్చ జరుగుతుందని .కార్మిక వర్గాన్ని నిరంతరము పోరాటం చేయడమే కాకుండా, కార్మిక వర్గాన్ని రాజకీయంగా చైతన్యం పరిచేందుకు ఈ రాజకీయ శిక్షణా తరగతులు కార్మిక వర్గానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కావున ఈ క్లాసులకు ఎంపిక చేసిన ప్రతినిధులు తప్పక హాజరై ఈ క్లాసులు జయప్రదం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఎం విజయ్, మిరియాల శ్రీను, గొర్ల శ్రీను, బారా చిన్నా ,వెంకన్న దుర్గాప్రసాద్ ధార్బల్ నూకరాజు, లావరాజు ,రమేష్, అప్పలనాయుడు, జేమ్స్ ,ఏసు, అశ్విన్ భాష ,ఎండి అహ్మద్ భాష, రవి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




