
నల్లగొండలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహానికి భూమిపూజ
Ground-breaking ceremony for the Munnuru Kapu student hostel in Nalgonda.
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ గార్డెన్స్ సమీపంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్టు ఆధ్వర్యంలో హాస్టల్ భవన నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ హాజరై భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థి వసతి గృహ భవన నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లాలోని మున్నూరు కాపు కులబంధువులందరూ భవన నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి నల్లగొండ పట్టణానికి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయం కల్పించడమే ఈ హాస్టల్ నిర్మాణం ప్రధాన ఉద్దేశమని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ హోదాల్లో ఉన్న రాజకీయ నాయకులను కలిసి భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సమీకరిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్టు అధ్యక్షులు నేతి రఘుపతి, ప్రధాన కార్యదర్శి తోకల వెంకటకృష్ణ, కోశాధికారి నేతి ఉమామహేశ్వర్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కోశాధికారి కంచి సత్యనారాయణ, పందిరి వేణు పాల్గొన్నారు.
తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు తుడి జనార్దన్ పటేల్, గౌరవ అధ్యక్షులు కాటం సునీల్, ఉపాధ్యక్షులు మేకల వెంకన్న, సహాయ కార్యదర్శి రామగిరి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు కంచనపల్లి జవహర్ లాల్, నాగులంచ స్వామి తదితరులు హాజరయ్యారు.
ట్రస్టు బోర్డు సభ్యులు వాసుదేవుల వెంకట నరసయ్య, శేషనాల రఘువీర్, వొలి సమీర్ కుమార్, గాలి వెంకటేశ్వరరావు, వైద్యం వెంకటేశ్వర్లు, కేసిడి వెంకట నరసయ్య, నాగులపల్లి శ్యాంసుందర్, జువాజీ ఇంద్రయ్య పాల్గొన్నారు.
అలాగే వీడియో జర్నలిస్ట్ చేపూరి రవి, సంఘం నాయకులు పందిరి వెంకటేశ్వరమూర్తి, సుధాకర్, వసంత సత్యనారాయణ, పంతులు శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన ఈ నిర్మాణానికి మున్నూరు కాపు సమాజం నుంచి పూర్తి సహకారం అందించాలని నిర్వాహకులు కోరారు.




