జవహర్ నగర్ ఆదర్శనగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్
మేడ్చల్
Police cordon search in Jawahar Nagar Adarsh Nagar
మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, వికలాంగుల కాలనీ, ఆదర్శనగర్ కాలనీలో, సుమారు 130 మంది పోలీసు బలగాలతో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. మల్కాజ్గిరి డిసిపి, పద్మజా రెడ్డి పాల్గోన్నారు.
డిసిపి మాట్లాడుతూ… రాజ కొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు, ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, నివాసంగా ఇటువంటి ప్రాంతాలను ఎంచుకున్నారని అనుమానంతో తనిఖీలు చేసామని అన్నారు… చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారికి, కి, ఇండ్లను అద్దెకి ఇవ్వాలన్నా సరే, ప్రజలు ఆలోచించాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఎటువంటి అనుమతులు లేని 17 ద్విచక్ర వాహనాలను, మద్యం బాటిల్లను సీజ్ చేసారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, కుషాయిగూడ ఏసిపి మహేష్, వివిధ ప్రాంతాలకు చెందిన ఏడు మంది సీఐలు, జవహర్ నగర్ పోలీసులు పాల్గొన్నారు.