- Advertisement -
By ఆముదాల వెంకన్న
త్రివేణి పాఠశాలలో క్రీడా సంబరాలు ఘనంగా నిర్వహించారు. బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో హౌస్ విద్యార్థులు మార్చ్ఫాస్ట్లో పాల్గొన్నారు. డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి సందేశమిచ్చారు. ముఖ్య అతిథి ఆర్పీఎఫ్ ఎస్ఐ అనూష, అతిథి అప్పారావు విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ క్రీడల ప్రాముఖ్యత వివరించారు. ఒలింపిక్ జ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు.వాలీబాల్, ఖోఖో, లెగ్ క్రికెట్ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపారు. ఉపాధ్యాయులు, వైస్ ప్రిన్సిపల్స్ స్వప్న, ముస్తఫా పాల్గొన్నారు.
- Advertisement -




