పొగాకు, మత్తు వ్యసనాలతో బాల్యానికి ముప్పు

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మం: పొగాకు, మత్తు పదార్థాల వినియోగం ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారుతోందని ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. నో టుబాకో కార్యక్రమంలో భాగంగా మోమినాన్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. పొగాకు వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని డాక్టర్ శ్రావణి వివరించారు. మత్తు వ్యసనాలకు దూరంగా ఉండాలని డాక్టర్ సోహెల్ సూచించారు. అనంతరం విద్యార్థులు,ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో హెచ్‌ఈఓ వీరన్న, జయపాల్, జానకి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular