- Advertisement -
By CHIRANJI THIRUPATHI
కొత్తపల్లి మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి ఎమ్మార్వో వెంకటలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు మాట్లాడుతూ రైతులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
- Advertisement -




