నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి సంఘం ఏర్పాట్లు

- Advertisement -

By ఆముదాల వెంకన్న

నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సేవా కార్యక్రమానికి వనమా ట్రస్ట్ అధినేత వనమా సూరి 15 దుప్పట్లను విరాళంగా అందజేశారు. సంఘం అధ్యక్షుడు మిట్టపల్లి రవికి వాటిని అందించారు.ఈ సందర్భంగా రవి దాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మాజీ ఉపాధ్యక్షులు అనిల్, నాయకులు విన్నమూరి సుబ్బారావు, పసుమర్తి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular