‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమా ప్రీ రిలీజ్

- Advertisement -

‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమా ప్రీ రిలీజ్

‘Ee Nagaraniki Emaindi Repeat’ movie pre-release

ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్ల మీద సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాణంలో తరుణ్ బాస్కర్ దాస్యం తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’. విశ్వక్ సేన్, అభినవ్

గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా నవంబర్ 19న రాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను

మంగళవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘తరుణ్ తన మిత్రబృందంతో కలిసి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా చేశాడు. రెండో పార్ట్ చేయమని విశ్వక్ సేన్

అన్నాడు. రీ రిలీజ్ గురించి కూడా అతనే చెప్పాడు. రీ రిలీజ్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ టైటిల్ పోస్టర్ వచ్చినప్పటి నుంచే క్రేజ్, హైప్ పెరిగింది. ఆల్రెడీ సినిమా అద్బుతంగా ఉందని టీం చెప్పింది. టీంకు అడ్వాన్స్ కంగ్రాట్స్. తరుణ్

దర్శకుడిగా ఇలాంటి మంచి చిత్రాలు తీస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. కనీసం ఏడాదికి ఒక చిత్రమైనా తీయాలని ఆశిస్తున్నాను. సృజన్ క్యాబ్ నడుపుతూ స్కోరీ డిస్కషన్‌లో పాల్గొన్నాడని తెలిసి

ఆశ్చర్యపోయాను. ఈ చిత్రం మా ద్వారా రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో సృజన్, సందీప్‌కి లాభాలు రావాలి. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’

అని అన్నారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ మూవీని ఆల్రెడీ టీం అంతా కలిసి చూశాం. సింక్ సౌండ్ కాబట్టి.. డబ్బింగ్‌ ఉండదు, నేరుగా ఫైనల్ కాపీనే చూశాం. సినిమా చూశాక

మాటలు రాలేదు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో ఒక్కొక్కరు ఒక్కో పాత్రకి కనెక్ట్ అవుతారు. రీ రిలీజ్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. పార్ట్ 2 తీయమని సురేష్ బాబు గారికి చెప్పాను. రీ

రిలీజ్‌లో ఆడియెన్స్ ఇచ్చిన ప్రేమను చూసి ఈ సెకండ్ పార్ట్ చేయాలని తరుణ్ ఫిక్స్ అయ్యాడు. స్నేహం అనేది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. సినిమా కనిపెట్టి వంద ఏళ్లు అయిందని అనుకుంటే.. అన్ని

బంధాల మీద సినిమాలు తీశారు. ఫ్రెండ్‌షిప్ కోసం సినిమా రావడానికి ఇన్నేళ్లు పట్టిందా? అని ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చూసి షాక్‌లో ఉండిపోయా. కచ్చితంగా ఈ ‘ఈ నగరానికి ఏమైంది

రిపీట్’ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ని రీప్లేస్ చేస్తుంది. మూవీ చూసి బయటకు వెళ్లాక నన్ను వెంటాడింది. నా జీవితంలో ఇదొక బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. ఇందులో చాలా సర్ ప్రైజ్‌లు ఉంటాయి.

అందరూ మాస్ బంక్ కొట్టండి. అందరూ గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది. నా కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ సినిమాగా నిలుస్తుంది. ఇంత వరకు ఎవ్వరూ చెప్పని, చూపించని ఎమోషనల్ డెప్త్‌ని తరుణ్

చూపించాడు. ఈ సినిమాకి, నా లైఫ్‌కి తరుణ్ హీరో’ అని అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ .. ‘‘విశ్వక్ సేన్, అభినవ్ ఇలా అందరూ ఈ 8 ఏళ్లలో ఎంతో ఎదిగారు. కానీ ఈ చిత్రం కోసం మళ్లీ 8 ఏళ్లు వెనక్కి వెళ్లారు. నా కోసం ఈ మూవీ సెట్‌లో ఎంతో సింపుల్‌గా

ఉన్నారు. ఈఎన్‌ఈ ఫ్యాన్స్ అంతా కలిసి ఈ పార్ట్ 2ని తీశారు. ఆడియెన్స్ అడిగారు ఈ మూవీని తీశాం. నా కథను నేనే చెప్పాలని ‘ఈ నగరానికి ఏమైంది’ తీశాను. అప్పుడు నేను ఏ లెక్కలు

వేసుకోలేదు. నా మనసుకి అనిపించింది నేను చేశాను. రీ రిలీజ్‌లో సంధ్య థియేటర్లో ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్, ఆ బాధ్యతతోనే ఒళ్లు దగ్గర పెట్టుకుని ‘ఈఎన్‌ఈ రిపీట్’ తీశాను. సినిమాలో పని చేసిన

ప్రతీ ఒక్కరినీ సమానంగానే చూశాం. ఎందులోనూ ఎక్కడా ఎవరితో బేధాలు చూపించలేదు. ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఉంటుంది. అప్పుడు చాలా మందికి థాంక్స్ చెప్పాలి. సౌండ్, మ్యూజిక్, కాస్ట్యూమ్,

ఎడిటింగ్, యాక్టింగ్ ఇలా అన్నింట్లో ప్యాషన్ కనిపిస్తుంది. చిన్న సినిమాగా స్టార్ట్ అయింది కానీ ఆడియెన్స్ ప్రేమ వల్ల ఇంత పెద్ద సినిమాగా మారింది. ప్రేమ, భక్తితో ఈ చిత్రాన్ని తీశాను. నా ఫ్రెండ్స్ వివేక్,

ఉప్పు, కౌశిక్‌లకు థాంక్స్. చిన్న పిల్లలు, పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి చూసేలా సినిమాని తీశాను. ఒక్క ఫ్రైడే కోసం ఈ సినిమా తీయలేదు. భవిష్యత్ తరాలు కూడా చూసి ఎంజాయ్ చేసేలా చిత్రాన్ని

తీశాను’ అని అన్నారు.
నిర్మాత సృజన్ ఎరబోలు మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ జర్నీ రెండేళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఇది సౌమిత్రి వల్లే ప్రారంభమైంది. టీం అంతా కలిసి ఓ ఫ్యామిలీలా షూటింగ్ చేశాం. మాకు

రైట్స్ ఇచ్చిన సురేష్ బాబు గారికి థాంక్స్. రిలీజ్ విషయంలో సపోర్ట్ చేసిన దిల్ రాజు గారికి థాంక్స్. ప్రొడక్షన్ విషయంలో తరుణ్‌ని నేను ఎప్పుడూ నిరుత్సాహ పర్చలేదనే అనుకుంటున్నాను. నాకు ఈ

అవకాశం ఇచ్చిన తరుణ్‌కి థాంక్స్. రెగ్యులర్ ఆడియెన్ నుంచి నిర్మాతగా మారాను. ప్రేక్షకుల కోసమే ఈ మూవీని తీశాను. అందరూ కలిసి వచ్చి ఈ సినిమాని సెలెబ్రేట్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత సందీప్ నాగిరెడ్డి మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చిత్రంలో సృజన్ వల్లే భాగమయ్యాను. తరుణ్ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. గత రెండేళ్ల నుంచి తరుణ్‌ని చూస్తున్నాను.

అతను చాలా మంచి వ్యక్తి. నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా నటించారు. నవంబర్ 19న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ జర్నీ అద్భుతంగా అనిపించింది. ఆరోన్ గారి కెమెరా వర్క్, వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అందరినీ మెప్పిస్తుంది. మధురిమ గారు,

కరుణ కుమార్ గారు, గీతా గారు ఇలా టీం అందరితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అభినవ్, విశ్వక్, శ్రీనాథ్, వెంకటేష్‌లతో షూట్ అంతా సరదాగా సాగింది. నవంబర్ 19న మా సినిమాని అందరూ

చూడండి’ అని అన్నారు.
అనీషా ఆంబ్రోస్ మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన తరుణ్‌కి థాంక్స్. నన్ను తెరపై అందంగా చూపించి ఆరోన్‌కి థాంక్స్.

మళ్లీ మళ్లీ ఈ టీంతో పని చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చిత్రంలో నేను పార్ట్ అవ్వడం నా అదృష్టం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన తరుణ్‌కి థాంక్స్. కార్తీక్ పాత్రను అందరూ ప్రేమించారు.

ఆడియెన్స్ ప్రేమను మ్యాచ్ చేసేలా నా బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాను. వివేక్ సాగర్ అన్న మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. మా బాయ్స్ అందరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. నవంబర్ 19న మా

చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
అభినవ్ గోమటం మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది’ ప్రయాణం సురేష్ బాబు గారి వల్ల ప్రారంభమైంది. సృజన్, సందీప్ వల్ల ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ ఇంత వరకు వచ్చింది. మా ఈ

ఎనిమిదేళ్ల ప్రయాణం ఎంతో అద్బుతంగా అనిపిస్తుంది. రీ రిలీజ్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పార్ట్ 2 ఆడియెన్స్ కోరిక మేరకే వస్తోంది. ఆల్రెడీ సినిమాని చూశాం. నిజంగానే అద్బుతంగా

వచ్చింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. పార్ట్ 1ని ఎంజాయ్ చేసినట్టుగానే పార్ట్ 2ని కూడా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
నటుడు వెంకటేష్ మాట్లాడుతూ .. ‘‘మా కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరూ మా టీజర్, ట్రైలర్‌లను ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన తరుణ్ అన్నకి థాంక్స్.

ఆయనకెప్పుడూ రుణ పడి ఉంటాను. వివేక్ గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆరోన్ మా అందరినీ అద్భుతంగా చూపించాడు. విశ్వక్, అభినవ్, శ్రీనాథ్, అనీషా, శివాత్మికలతో కలిసి పని చేయడం ఆనందంగా

ఉంది. నవంబర్ 19న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
గీతా భాస్కర్ మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ కోసం చాలా మంది నిద్ర పోకుండా పని చేశారు. వాళ్లంరదికీ, ఆ టీం ఫ్యామిలీ మెంబర్లకు థాంక్స్. 8 ఏళ్ల తర్వాత పార్ట్ 2 తీస్తుండటం

ఆనందంగా ఉంది. రెండేళ్లుగా తరుణ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ సినిమాని తెరకెక్కించాడు’ అని అన్నారు.
వివేక్ సాగర్ మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది’ మాకు ప్రత్యేకమైన చిత్రం. తరుణ్‌తో సినిమా అంటే ఎప్పుడూ స్పెషల్ అనిపిస్తుంటుంది. తరుణ్‌తో వర్క్ చేయడం నాకెప్పుడూ గర్వంగా

ఉంటుంది. ఇందులో తరుణ్ కూడా ఓ పాట రాశాడు. మా బాయ్స్ అందరూ అద్భుతంగా నటించారు.
ఏజే ఆరోన్ మాట్లాడుతూ .. ‘నా కెరీర్‌లో ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన తరుణ్‌కి థాంక్స్. ఈ జర్నీలో నాకు తోడుగా ఉన్న నా కెమెరా

డిపార్ట్‌మెంట్‌కి థాంక్స్.’ అని అన్నారు.
కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సి మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన తరుణ్‌కి థాంక్స్. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా టీంకి

థాంక్స్. ప్రేమతో ఈ మూవీని చేశాం. నవంబర్ 19న మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.
ఎడిటర్ రవితేజ మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. తరుణ్‌తో వర్క్ అంటే ఓ హాలీడేలా ఉంటుంది. సెట్‌లో ఉండే స్ట్రెస్ అంతా తరుణ్ ఒక్కడే

తీసుకుంటాడు. ఎనిమిదేళ్ల క్రితం సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉంది’ అని అన్నారు.
సౌండ్ డిజైనర్ వరుణ్ మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన తరుణ్ అన్నకి థాంక్స్. సింక్ సౌండ్‌లో చేయడం గుడ్

ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది’ అని అన్నారు.
లిరిసిస్ట్ గాలి భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ నాకు అవకాశం ఇచ్చిన తరుణ్ గారికి థాంక్స్. ‘బ్రోచేవారెవరురా’ చిత్రం నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న వివేక్ సాగర్ గారికి

థాంక్స్. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’ అని అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ రాజేష్ పెంటకోట మాట్లాడుతూ .. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన తరుణ్ అన్నకి, నిర్మాతలు సృజన్, సందీప్ గార్లకు థాంక్స్. మేం ఖర్చు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. ఆరోన్

అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. నవంబర్ 19న మా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది’ టైంలో నేను డ్యాన్సర్‌గా ఉండేవాడిని. ఇందులో బతుకమ్మ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేయడం ఆనందంగా ఉంది. వివేక్ సాగర్ గారితో

స్టూడియోలోనే ఈ పాట గురించి డిస్కస్ చేశాం.
నటీనటులు : విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular