26.1 C
New York
Wednesday, June 19, 2024

రాపూరు సమీపంలో 16ఎర్రచందనం దుంగలు స్వాధీనం నలుగురు స్మగ్లర్లు అరెస్టు

- Advertisement -

రాపూరు సమీపంలో 16ఎర్రచందనం దుంగలు స్వాధీనం

నలుగురు స్మగ్లర్లు అరెస్టు
పట్టుబడ్డ ఒక టెంపో ట్రావెలర్, ఒక కారు

పెంచలకోన సమీపంలోని రాపూరు వద్ద 16ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టెంపోట్రావెలర్, మరో కారును టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు అధ్వర్యంలో ఆర్ఐ (రిజర్వు) కే. సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐలు కేఎస్కే లింగాధర్, కే.సురేష్ బాబు టీమ్ లు శుక్రవారం సాయంత్రం తిరుపతి నుంచి రాపూరు వరకు లోడింగ్, డంపింగ్ పాయింట్లను తనిఖీ చేస్తూ వెళ్లారు. రాపూరు నుంచి ఎగువపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున రెండు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడకు చేరుకున్నారు. వాహనాల్లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండంతో వారిని చుట్టు ముట్టారు. కొందరు పారిపోగా నలుగురిని పట్టుగోగలిగారు. వారిని తమిళనాడు తిరువన్నామలైకు చెందిన అన్బళగన్ (41), చిత్తూరు టౌన్ కు  చెందిన అసిఫ్ బాషా (21),ముత్తు (33), సెల్వం (30)లుగా గుర్తించారు. వీరి నుంచి 16 ఎర్రచందనం దుంగలు, ఒక టెంపో ట్రావెలర్, కారు, మూడు ఫాస్టాగ్ లు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై తిరుపతి టాస్క్ ఫోర్సు పోర్సు పోర్సు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎస్ఐ సీహెచ్ రఫీ దర్యాప్తు చేస్తున్నారు. వీటి విలువ రూ.40లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.. ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి రివార్డులు కోసం సిఫారసు చేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!