రాష్ట్రంలో 71 శాతం మంది యువ, మహిళా ఓటర్లే
హైదరాబాద్, ఆగస్టు 08: తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2023 జనవరిలో ఎన్నికల సంఘం ఈసీ, ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం..

ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది. మొత్తం ఓటర్లలో 2.12 కోట్లు (71 శాతం) మహిళలు, యువ ఓటర్లే ఉండటం గమనార్హం. ఈసీ గణాంకాల ప్రకారం.. మొత్తం ఓటర్లలో 18-19 ఏండ్ల వయస్సు ఉన్నవారు ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 2.78 లక్షలు ఉన్నారు.
గత జనవరిలో ప్రకటించిన తుది ఓటరు జాబితాలో వివిధ కారణాలతో 2.72 లక్షల మంది ఓటర్లను తొలగించారు. 6.84 లక్షల మందిని కొత్తగా చేర్చారు. ఈ మేరకు రాష్ట్రంలో 34,891 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2023 అక్టోబర్‌లో ప్రకటించే తుది జాబితా ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు…


