Monday, March 24, 2025

*మార్చి 31లోగా చార్జీలు చెల్లిస్తే 25 రాయితీ*

- Advertisement -

ఎల్‌ఆర్‌ఎస్‌ వేగవంతానికి జీవో జారీ*

*మార్చి 31లోగా చార్జీలు చెల్లిస్తే 25 రాయితీ*

*25 discount if charges are paid by March 31*

*లేఅవుట్‌లో 10 శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ అయు ఉంటే..* *నిర్ణీత చార్జీలతో మిగతా వాటి నమోదుకు అనుమతి* *అనధీకృత లే అవుట్లలో ప్లాట్ల రిజస్ట్రేషన్‌ కుదరదు* హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. గురువారం దానికి సంబంధించి ఉత్తర్వు జారీ చేసింది. ‘తెలంగాణ రెగ్యులరైజేషన్‌ ఆఫ్‌ అన్‌అప్రూవ్డ్‌ అండ్‌ ఇల్లీగల్‌ లేఅవుట్‌ రూల్స్‌ 2020’కి సవరణలు చేస్తూ.. సీఎస్‌ శాంతి కుమారి జీవోఎంఎస్‌ నంబర్‌ 28 విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జరిపిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అందులో పొందుపరచారు. ఆ జీవో ప్రకారం.. లే-అవుట్‌ యజమాని 2020 ఆగస్టు 26కు ముందు.. తాను అభివృద్ధి చేసిన లే-అవుట్‌లో 10 శాతం ప్లాట్లను రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా విక్రయించి ఉంటే, వారు ఎల్‌ఆర్‌ఎస్‌-2020 కింద దరఖాస్తు చేసుకున్నా, చేసుకోకపోయినా కూడా.. ఆ లే అవుట్‌లోని మిగతా 90 శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. సదరు లే-అవుట్‌లో భూమిని కొనుగోలు చేసినవారు సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తే వారి వద్ద నిర్ణీత ఫార్మాట్‌లో వివరాలు సేకరించి.. ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌కు పంపుతారు. అక్కడ నిర్ణీత క్రమబద్ధీకరణ చార్జీలు, ప్రోరేటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు వసూలు చేసి రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి వచ్చే ఆ వివరాలను రూల్‌ నంబర్‌ 6 కింద ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తుగా పరిగణిస్తారు. మార్చి 31/అంతకుముందు.. క్రమబద్ధీకరణ చార్జీలు, ప్రోరేటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు చెల్లించేవారికి 25 శాతం రాయితీ ఇస్తారు. జూ రెగ్యులరైజ్‌ కాని అనధీకృత, అనుమతిలేని లే-అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ కుదరదు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్