సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సంధ చెరువు కట్ట పైన జిల్లెలగూడ మీర్పేట్ గ్రామాల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం గౌడ సంఘం వారిని సన్మానించారు. మంత్రి మాట్టలాడుతూ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కమ్యూనిటీ కోసమే కాకుండా సొసైటీ కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఉన్న కొద్దిపాటి సైన్యంతో గోల్కొండ కోటపై యుద్ధం చేశారు గౌడుల రాజ్యాధికారం కోసం అహర్నిశలు పోరాడారు. ఈ గౌడ జాతిని మేల్కొల్పారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గౌడ జాతి వారికి సముచిత స్థానం కల్పించాలని చట్టసభలలో అవకాశం ఇచ్చారు. అలాగే మీర్పేట బడంగ్ పేట మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలలో గౌడుల కోరిక మేరకు తాటి చెట్లు ఈత చెట్లు నాటిస్తానని గౌడ సంఘం భవనం కోసం స్థలాన్ని కేటాయిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు