జగిత్యాల : జగిత్యాల జిల్లా. దాదాపు 200 మంది ని గల్ఫ్ దేశాలకు పంపిస్తానని ఐదు కోట్లు వసూలు చేసి పరారైన ఏజెంట్ ..
జగిత్యాల పట్టణంలో శ్రీ విఘ్నేశ్వర ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ పేరుతో గల్ఫ్ కార్మికులను మోసం చేసిన గల్ఫ్ ఏజెంట్.. కన్సల్టెన్సీ ఎదుట బాధితుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.
బాధితుల ధర్నా
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏజెంట్ మోసం చేశాడంటూ దాదాపు 200 మంది గల్ప్ బాధితులు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దాదాపు ఐదు కోట్లకు పైగా వసూలు చేసి పరారైనట్లు బాధితుల ఆరోపిస్తున్నారు. జగిత్యాల కు చెందిన ఏజెంట్ మహేష్ జగిత్యాల లో మ్యాన్ పవర్ ఆఫీస్ పేరిట కార్యాలయం ఏర్పాటుచేసి విదేశాలలో ఉద్యోగులు ఇస్తామంటూ వందలాది మంది దగ్గర డబ్బులు తీసుకొని. నకిలీ వీసాల తో మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. యూరప్, దుబాయ్, కువైట్, థాయిలాండ్ దేశాలకు పంపిస్తామని చెప్పి నకిలీ వీసాలు ఇచ్చినట్టు బాధితుల ఆరోపిస్తున్నారు.