వంద రోజుల డెడ్ లైన్ ముగిసింది
6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేదు?
ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందే
బీఆర్ఎస్ చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు
ఒక్క బైక్ పై 126 గొర్రెలు ఎక్కించినట్లు రూ.కోట్లు వసూలు చేసిన చరిత్ర వాళ్లది
బండి సంజయ్
వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన గడువు ఇయాళ్టితో ముగిసింది. కానీ వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసింది. ఎన్నికల హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసిందని ఎంపి బండి సంజయ్ అన్నారు. . ఎందుకు అమలు చేయలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘‘వంద రోజుల్లోనే మహిళలకు ప్రతినెలా రూ.2500 లు ఇస్తామని మోసం చేశారు. రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15వేలు ఇస్తామని ఇయ్యనేలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇయ్యలేదు. వ్రుద్దులు, వితంతవులకు చేయూత కింద రూ.4 వేలు ఇస్తామని మోసం చేశారు… మరి మీకెందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
ప్రజాహిత యాత్రలో భాగంగా ఇల్లంతకుంట మండలంలో పర్యటించిన బండి సంజయ్ ఈరోజు మధ్యాహ్నం మండల కేంద్రంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పంట మద్దతు ధర మోదీ ప్రభుత్వం వచ్చాకా పెరిగింది. యూరియా బ్యాగు అసలు ధర రూ.2500లు. అయితే సబ్సిడీ మీద మీకు 25o రూపాయలకే మోదీ ప్రభుత్వం అందిస్తోంది. రైతులకు సబ్సిడీల ద్వారా నరేంద్ర మోడీ ఎకరానికి 20 వేల రూపాయలు వరకు సహాయం చేస్తున్నారు.
మోదీ ప్రధాని కాకుంటే రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. ఒక్కో రైతు మీద 20 వేల రూపాయలు అదనపు భారం పడుతుంది. * రేషన్, వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు అంటే మోదీ అంటారు.ఓటు మాత్రం కాంగ్రెస్ కి వేయడం బాధాకరమని అన్నారు. .కేంద్ర ప్రభుత్వ నిధులు రావాలంటే ఢిల్లీలో మోదీ ప్రభుత్వం రావాలి. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి గెలిస్తేనే మీకు మేలు జరుగుతుంది. కాళేశ్వరం పేరు చెప్పి కేసిఆర్ లక్ష కోట్లు దొబ్బిండు.గొర్రెల స్కీమ్ పేరిట 500 కోట్ల రూపాయలు దొబ్బారు. కరీంనగర్ లో గడ్డి చెక్కామని 10 లక్షలు రూపాయలు బీఆర్ఎస్ నేతలు దొబ్బారని ఆరోపించారు.
6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేదు?
- Advertisement -
- Advertisement -