- Advertisement -
ఒంగోలు: 65 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత ఒంగోలు నుంచి నెల్లూరుకు తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యం వాహనాన్ని కావలి గ్రామీణ సీఐ కావేటి శ్రీనివాస్ పట్టుకున్నారు. శుక్రవారం జాతీయ రహదారిపై కావలి మండలం గౌరవరం టోల్ ప్లాజా వద్ద ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి రిజిస్టర్డ్ పత్రాలు లేని బొలేరో వాహనంతో పాటు 65 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషను తరలించారు.
- Advertisement -