- Advertisement -
బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు,17 మంది కార్పొరేటర్లు డుమ్మా!
రేపు GHMC కౌన్సిల్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కేటీఆర్ మరియు హరీష్ రావు ఢిల్లీలో ఉన్నందున ఈ సమావేశం మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని 8 మంది
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే 17 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. వీరు ఎందుకు గైర్హాజరు అయ్యారంటూ కేటీఆర్,హరీష్ రావులు ఢిల్లీ నుంచి ఆరా తీస్తున్నారు.
కాగా వీరిలో పలువురు ఎమ్మెల్యేలకు కేటీఆర్,హరీష్ రావులు నేరుగా కాల్ చేసిన అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది.
- Advertisement -