
సైబరాబాద్: విచ్చలవిడిగా నిషేదిత ఈ సిగరేట్లను విక్రయిస్తున్న ముఠా ను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను ,పబ్ లను టార్గెట్ గా చేసుకుని నిషేదిత సిగరేట్లను ముఠా అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుండి 2 లక్షల విలువ చేసే ఈ సిగరేట్లు స్వాధీనం చేసుకున్నారు.

మాదాపూర్ డీసీపీ సందీప్ రావు మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ – సిగరెట్ లు విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఈ సిగరెట్లు విక్రయిస్తున్న మొత్తం పది మందిని గుర్తించాం. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారీలో ఉన్నారని అన్నారు.
నిందితుల వద్ద నుండి రెండు లక్షల రూపాయలు విలువ చేసే 99 డిస్పోసల్ ఈ – సిగరెట్లు,05 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఈ-సిగరెట్లు 2019 లో బ్యాన్ చెయ్యడం జరిగింది. ఈ సిగరెట్లు విక్రయించినా, కొనుగోలు చేసినా చట్ట పరమైన చర్యలు తప్పవని అయన అన్నారు.



