బీసీ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట: వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కుల వృత్తులను ప్రోత్సహించడానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమం సిద్దిపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరై నారాయణరావుపేట, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాలలోని 200 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బిసి కుల వృత్తిదారులకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయపథకం. బ్యాంకుల ద్వారా షూరిటీ, గ్యారెంటీ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ఒక లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి బీసీ కుల వృత్తిదారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో నాయి బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు ఇస్తున్నాం. గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ చేస్తున్నామని అన్నారు.