- Advertisement -
పోలంపల్లి మండల ప్రజా పరిషత్ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులు
Students of Polampally Mandal Praja Parishad School who fell ill
జయశంకర్ భూపాలపల్లి డిసెంబర్ 24
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలగించాయి. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు కూడా చనిపోయారు. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహముత్తరం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల వద్ద ఉన్న అడవి ఆముదం కాయలు తిన్న విద్యార్థులు వాంతులు, విరోచనాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -