- Advertisement -
మద్యం మత్తులో మహిళ బ్లేడ్‌తో హల్చల్ చేసింది.హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో ఓ మహిళ అర్ధనగ్నంగా నడుస్తూ బ్లేడ్ పట్టుకుని వెహికల్స్‌కు అడ్డుగా వెళ్లింది.స్థానికులు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఆమెను ఆటోలో ఎక్కించి చిక్కడపల్లి పీఎస్‌కు తరలించింది.అక్కడి నుంచి ఆమెను దోమలగూడ పీఎస్‌కు తీసుకెళ్లారు. సీఐ శ్రీనివాస్ రెడ్డిని వివరాలు కోరగా.. జూబ్లీహిల్స్ కు చెందిన సదరు మహిళకు భర్తతో విభేదాలున్నట్లు తెలిసిందన్నారు. పూర్తి వివరాలు చెప్పకుండానే ఆమె స్టేషన్ నుంచి వెళ్లిపోయిందన్నారు. మహిళను కనీసం విచారించని పోలీసుల తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -