ఎస్సై రాజేంద్రన్ మాములోడు కాదు
హైదరాబాద్, ఆగస్గు 28: సైబరాబాద్: సైబర్‌క్రైమ్ ఠాణాలో పనిచేస్తున్న ఎస్సై రాజేంద్ర అరెస్ట్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సై రాజేంద్ర నుండి 1.7 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. Methaqualone అనే డ్రగ్స్ ను రెండు ప్యాకెట్లలో పెట్టుకున్న అమ్మేందుక ప్రయత్నించగా వాటిని సీజ్ చేశారు పోలీసులు. ఒక ప్యాకెట్ లో 980 గ్రాములు, మరో ప్యాకెట్ లో 770 గ్రాముల డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తనకు ఒక నైజీరియన్ డ్రగ్స్ ప్యాకెట్ లు ఇచ్చినట్టు ఒప్పుకున్న ఎస్సై రాజేంద్ర .. ఒక సైబర్ క్రైం కేస్ నిమిత్తం ముంబై కి వెళ్లినప్పుడు.. ముంబై లోని ఖాందేశ్వర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నిందితుడు నైజీరియన్ పట్టుకున్నారు. అక్కడి నుండి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ లు నైజీరియన్ ను తరలిస్తున్న క్రమంలో నైజీరియన్ తో కలిసి ప్లాన్ చేశాడు ఎస్సై రాజేంద్ర. తాను డ్రగ్స్ ప్యాకెట్లు అమ్ముతానని ప్యాకెట్లు తెచ్చుకున్న రాజేంద్ర.. చిత్రపురి కాలనీ కమాన్ వద్ద ఈ నెల 25 న డ్రగ్స్ ను బ్యాగ్ లో పెట్టుకుని బైక్ పై వెళ్లాడు. అయితే.. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు రాజేంద్రన్. దీంతో.. ఎస్సై రాజేంద్ర ను చేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్ర నుండి 50 లక్షలు విలువ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.అయితే.. రాష్ట్రంలో డ్రగ్స్ అణిచివేతకు ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీన్యాబ్) నిఘాను పటిష్టం చేస్తూ డ్రగ్ విక్రేతల జాడను గుర్తిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి డ్రగ్స్ రాకుండా కట్టడి చేయడంతో పాటు స్థానికంగా డ్రగ్స్ విక్రయాలు చేసే వారిపై, వినియోగించే వారిపై కూడా ఫోకస్ పెట్టారు. తాజాగా.. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణాలో పనిచేస్తున్న ఎస్సై రాజేంద్ర డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించిన టీన్యాబ్ అరెస్టు చేసింది.