Saturday, February 14, 2026

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

- Advertisement -

తుమ్మలకు స్వాగతం: పొదేం వీరయ్య

భద్రాద్రి:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పొదేం వీరయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ పాలనతో తెలంగాణ రాష్ట్రం భ్రష్టుపట్టి పోయింది. ఏ ఒక్క రంగంలో కేసీఆర్ విజయం సాధించలేదు. చేతిలో బెల్లం ముక్క పెట్టిన చందంగా దళిత బంధు పధకం చేశారు. పోడు పుస్తకాల్లో కనీసం సరిహద్దులు ఇవ్వలేదు.  సర్వే నెంబర్ లేదు. మొక్కుబడికి మాత్రమే ఇచ్చారని అన్నారు. ఎన్టీఆర్ రామారావు అంతటోడికే  ఒకసారి మాత్రమే అధికారం ఇచ్చారు ప్రజలు. వామ పక్ష పార్టీలను మునుగోడు లో వాడుకొని వదిలేసిన ఘనుడు కేసీఆర్ అని చెప్పక తప్పదు. బీఆర్ఎస్ పార్టీ టికెట్స్ ఇచ్చిన నాడు కమ్యూనిస్టు ల కు న్యాయం చేయలేదు. భద్రాద్రి జిల్లాలో 5 స్థానానాలకు 5 స్థానాలు గెలుస్తాం. జిల్లాలో అభివృద్ధి చేసిన నాయకుడు తుమ్మల. అటువంటి తుమ్మల కాంగ్రెస్ పార్టీ లోకి వస్తే జిల్లా అధ్యక్షుడు గా స్వయంగా నేనే ఆహ్వానం పలుకుతానని అన్నారు.  పొంగులేటి పై గతంలో తాటి వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అయనఅన్నారు. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్