కరెంట్ కోతల అంశం ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహాం..
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్..
హైదరాబాద్ : అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయతకు ప్రతిరూపం రాఖీ పండుగ అని దేశ వ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్న ప్రజలందరికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు,తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు..
పర్యటనల్లో కేసీఆర్ 2,3 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలా…24 గంటలు కరెంట్ కావాలా అని ప్రజలకు చెబుతున్నారు. రాష్ట్రంలో లో ఎక్కడ కూడా 10,12,గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇవ్వడం లేదు కేసీఆర్ సర్కార్. రానున్న రోజుల్లో ఇందులో కూడా కోత ఉండనుంది.. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రాష్ట్ర రైతాంగం ఆగమైతున్నారు. తీరా కరెంట్ మాత్రం ఒక్కోచోట 6 గంటలు కూడా ఇవ్వడం లేదు. మంత్రులు బాగా మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా 14 గంటలు ఇస్తలేరు.. 24 గంటల కరెంట్ ఇవ్వడం చేత కాకుంటే మాతో కాదని చెప్పండి. ఒక సాధారణ నల్లగొండ రైతు బాధతో నాకు మెసేజ్ చేయడం జరిగింది. పంటలు ఎండిపోతునున్నాయి ఇప్పటికైనా స్పందించండి. ఇప్పటికీ నాకు కరెంట్ కోతపై నల్గొండ మండలం నుంచి పిర్యాదులు వస్తున్నాయి.. నల్గొండ మండలం అప్పాజీ పేటలో వారం నుంచి కనీసం 6గంటలు కూడా కరెంట్ రావడం లేదు.. పొలాలు ఎండిపోతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.. 24 గంటలు ఇచ్చేంతా కరెంట్ మీద దగ్గర లేకపోతే చెప్పండి సీఎం కేసీఆర్… మీ దగ్గర లేకపోయిన పక్కా రాష్ట్రాల నుంచి అయిన కోని ప్రజలకు 24 గంటల కరెంట్ ఇవ్వండి.. ప్రభుత్వం మాటల నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారు… మీరిచ్చిన రైతు బంధు డబ్బులు రైతు తెచ్చిన పెట్టుబడికి వడ్డీ కట్టేందుకు కూడా సరిపోవడం లేదు.. కనీసం కరెంట్ అయిన పూర్తి స్థాయిలో ఇచ్చి రైతు నష్టపోకుండా చూడాలని కేసీఆర్ ను కోరుతున్నాను… మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఈ నెల రోజులు అయిన 24 గంటల కరెంట్ ఇవ్వండి కేసీఆర్ గారు..



