ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు కేసీఆర్ కు ఉన్నాయి : ఎంపీ రవిచంద్ర
కేంద్రంలో బిఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుంది: ఇల్లందు సభ లో ఎంపీ రవిచంద్ర
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11 (వాయిస్ టు డే ): తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ భవిష్యత్ లో దేశ ప్రధాని అవుతారని రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రధాని అయ్యేందుకు కేసీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి గా నియమితులైన రవిచంద్ర తొలిసారిగా సోమవారం ఇల్లందు విచ్చేశారు. మహబూబ్ బాద్ ఎంపి మలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యం లో ఎంపి రవిచంద్ర కు బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భం గా ఏర్పాటుచేసిన సభ లో రవిచంద్ర ప్రసంగిస్తూ తాను ఇల్లందు కు ఇంఛార్జి గా కాక, అందరినీ సమన్వయ పరిచే కార్యకర్త గా మాత్రమే వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ఇల్లందు ఊపిరులూదిందని ఆయన అన్నారు.

ప్రధాని అవుతారని, అందుకు డప్పువాయిద్యాలు, లంబాడ,కోయ నృత్యాలు,కోలాటం, పటాకులు కాల్చుతూ రవిచంద్రకు ఘన స్వాగతం పలికారు, గజమాలతో సత్కరించారు. ఎంపీ వద్దిరాజు ఇల్లందులో మొదట అభయజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాక, యువతను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ 3కిలోమీటర్లు వడివడిగా నడిచారు. పోలీసుస్టేషన్ చేరుకున్నాక ప్రచారరథమెక్కి చౌఈ గులాబీ శ్రేణులు,ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిన నాయకుడిని కేసీఆర్ గారు చేరదీసి జెడ్పీ ఛైర్మన్ పదవి కట్టబెడితే డబ్బు సంచులకు అమ్ముడుపోయాడని, వారి ఆటలు సాగనివ్వమని రవిచంద్ర స్పష్టం చేశారు. తానిక్కడకు పెత్తనం చేసేందుకు రాలేదని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గులాబీ శ్రేణులను సమన్వయం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పంపితే వచ్చానన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియల అఖండ విజయం తథ్యమన్నారు. ఇందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు.



