లియాఫీ-1964 జాతీయ మహాసభలు విజయవంతం – నూతన జాతీయ నాయకత్వం ఎన్నిక
LIAFI 1964 National Conference a Success – New National Leadership Elected
హైదరాబాద్‌లో నిర్వహించిన భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ-1964) జాతీయ జనరల్ బాడీ సమావేశాలు ఘన విజయాన్ని సాధించాయి. దేశం నలుమూలల నుంచి సుమారు 3,500 మంది జీవిత బీమా ఏజెంట్లు, ప్రతినిధులు, జాతీయ నాయకులు ఈ మహాసభలకు హాజరై సంస్థ బలోపేతంపై చర్చించారు.
సమావేశాల అనంతరం జరిగిన ఎన్నికల్లో ఢిల్లీకి చెందిన సతీందర్ సింగ్ కాలా జాతీయ అధ్యక్షుడిగా, హైదరాబాద్‌కు చెందిన ఎస్.బి. శ్రీనివాస చారి సెక్రటరీ జనరల్‌గా, సింగారపు శ్రీనివాస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా, బొడ్డుపల్లి శ్రీరామ్ జాతీయ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను భారతదేశపు నంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, మాజీ సీఎల్ఐఏ ఛైర్మన్, లియాఫీ-1964 జనరల్ బాడీ సమావేశాల అడ్వైజరీ కమిటీ సహ-ఛైర్మన్ కౌటికె విఠల్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
అదే రోజు సెక్రటరీ జనరల్‌గా ఎన్నికైన ఎస్.బి. శ్రీనివాస చారి జన్మదినం కావడంతో, సభా వేదికపై గజమాలతో సత్కరించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ మహాసభలను విజయవంతం చేయడానికి గత రెండు నెలలుగా నిరంతరం శ్రమించి విశేష కృషి చేసిన శ్రీనివాస చారి సేవలను జాతీయ నాయకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా జీవిత బీమా ఏజెంట్ల హక్కులు, సంక్షేమం, వృత్తి అభివృద్ధికి ఈ సమావేశాలు కొత్త దిశానిర్దేశం చేశాయని పలువురు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.




