మానవత్వం చాటుకున్న మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంటా.రవీందర్ మరియు సభ్యులు,గ్రామ యువకులు. గూడు లేని వృద్ధురాలికి అన్ని తానై స్వంత ఇంటి కల నెరవేర్చిన మహాత్మా హెల్పింగ్ హాండ్స్. పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన వితంతువు చిప్పల.సోమక్క అనే వృద్ధురాలు ఆమె మనుమడు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కాగా వారు చిన్న పాటి ఒక గుడిసె వేసుకొని కూలి పనులకు వెళ్తూ ఆమె కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ తీసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్న నేపధ్యంలో కొద్దీ రోజుల క్రితం వేసుకున్న గుడిసె కాస్త శిథిలావస్థకు చేరి శిథిలమైనది. ఇంతలో గ్రామానికి చెందిన కొందరు యువకులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన ఆమె దిన స్థితి గూర్చి సమాచారాన్ని తెలుసుకున్న వావిలాల గ్రామానికి చెందిన మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంటా.రవీందర్ చలించిపోయి గ్రామానికి చెందిన యువకులు, దాతల సహకారంతో మిగితా డబ్బులు మహాత్మా హెల్పింగ్ హాండ్స్ ద్వారా అందించి ఒక లక్ష 30 వేల రూపాయలతో ఒక గది నిర్మాణం చేపట్టి సోమక్క కు అందజేయాగ ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయి మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశములో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్, డాక్టర్ కల్నల్ భిక్షపతి మాట్లాడుతూ తనకున్న దానిలో కొద్దిగ ఆయిన సమజాములో అవసరం ఉన్న పేద వారికి సహాయం చేయడం మానవత్వం అని అన్నారు . ఈ మానవత్వము చూపడములో గంట రవిందర్ ఎప్పుడు ముందు ఉంటారని దీనికి వావిలాల గ్రామస్తులు కూడా కలిసి ఇటువంటి మంచి పనిని చేయడం అభినందనీయము అని అన్నారు . ఈ కార్యక్రమము లో సర్పంచ్ గంటా. పద్మ భాస్కర్, ఎంపీటీసీ నల్లపు మౌనిక అశోక్ , ఉప సర్పంచ్ కోలా విజయ రాజు మరియు దాతలు , సహయము చేసిన వారు గ్రామస్తులు పాల్గొన్నారు. సహాయ సహకారాలు అనిదించిన దాతలను మరియు సహాయం చేసిన వారిని సన్మానించడం జరిగింది



